శేఖర్ కమ్ముల అందిస్తోన్న మరో ఆణిముత్యం పవన్Sekhar Kammula introducing another musical talent Pawan CH
Sekhar Kammula introducing another musical talent Pawan CH

సాంకేతిక నిపుణుల దగ్గరనుండి అసలైన సత్తా బయటకు తీయడం దర్శకుల పని. ఒక్కో దర్శకుడి శైలి ఒక్కోలా ఉంటుంది. ప్రతి సాంకేతిక నిపుణుడి దగ్గరనుండి సరైన అవుట్ పుట్ ను తీసుకునే బాధ్యత కచ్చితంగా దర్శకుడి పైనే ఉంటుంది. సాంకేతిక నిపుణులు అందరూ ప్రతి సినిమాకూ ఒకేలా కష్టపడుతుండచ్చు కానీ ఎందుకని త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ వంటి సంగీత దర్శకుల ఆడియో సూపర్ హిట్ ఉంటుంది? ఈ మధ్య కాలంలో కీరవాణితో చాలా మంది దర్శకులు పనిచేసారు. కానీ రాజమౌళి సినిమాకు ఉన్న స్థాయిలో అవుట్ పుట్ మరో సినిమాకు ఎందుకు లేదు?

ఉదాహరణకు శేఖర్ కమ్ములనే తీసుకుంటే తన ప్రతి సినిమాలో మ్యూజిక్ హైలైట్ అయ్యేలా చేసుకుంటాడు శేఖర్ కమ్ముల. తన మొదటి సినిమా నుండి ఇప్పటివరకూ ప్రతీదీ మ్యూజికల్ హిట్టే. తన సినిమాలు ప్లాప్ అయి ఉండొచ్చు కానీ మ్యూజిక్ మాత్రం ఎప్పుడూ ప్లాప్ అవ్వలేదు. అందుకు తన మ్యూజిక్ సెన్స్ ప్రధాన కారణమై ఉండొచ్చు. సంగీత దర్శకుల నుండి తనకు కావాల్సిన విధంగా మ్యూజిక్ రాబట్టుకోవడంలో శేఖర్ కమ్ముల ఎప్పుడూ సక్సెస్ అవుతూనే వచ్చాడు.

శేఖర్ కమ్ముల మొదటి రెండు సినిమాలు ఆనంద్, గోదావరిలకు రాధాకృష్ణ పనిచేసాడు. ఆ సినిమాల్లో పాటలు ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక మూడో సినిమా నుండి మిక్కీ జె మేయర్ తో తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అప్పట్లో హ్యాపీ డేస్ పాటలు యువతరాన్ని ఒక ఊపు ఊపేసాయి. ఆ తర్వాత లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు కూడా మిక్కీనే పనిచేసాడు. ఆ రెండు సినిమాల ఆల్బమ్స్ కూడా పెద్ద హిట్.

ఇక రీసెంట్ గా ఫిదా విషయానికి వచ్చేసరికి శక్తికాంత్ కార్తీక్ ను సంగీత దర్శకుడిగా పరిచయం చేసాడు. వచ్చిండే సాంగ్ ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు లేటెస్ట్ సినిమా నాగచైతన్యతో చేస్తోన్న లవ్ స్టోరీకి మరో కొత్త సంగీత దర్శకుడ్ని పరిచయం చేస్తున్నాడు. పవన్ సిహెచ్ ఈ చిత్రం ద్వారానే సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మరి ఈ చిత్రం పాటల ద్వారా ఎంత పెద్ద సంచలనమవుతుందో అన్నది చూడాలి.