ధనుష్ సినిమాకు అదిరిపోయే టెక్నికల్ టీమ్ ను రెడీ చేస్తోన్న శేఖర్ కమ్ముల

ధనుష్ సినిమాకు అదిరిపోయే టెక్నికల్ టీమ్ ను రెడీ చేస్తోన్న శేఖర్ కమ్ముల
ధనుష్ సినిమాకు అదిరిపోయే టెక్నికల్ టీమ్ ను రెడీ చేస్తోన్న శేఖర్ కమ్ముల

సెన్సిబుల్ చిత్రాలతో తనకంటూ విశేషమైన గుర్తింపును తెచ్చుకున్న శేఖర్ కమ్ముల ఇప్పటివరకూ లో బడ్జెట్ లోనే ఎక్కువగా చిత్రాలు చేస్తూ వచ్చాడు. కమ్ముల డైరెక్ట్ చేసిన లవ్ స్టోరీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల తొలిసారి ప్యాన్ ఇండియా చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు.

తమిళ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ తో శేఖర్ కమ్ముల తెలుగు, తమిళ్, హిందీలో త్రిభాషా చిత్రాన్ని అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. ఏషియన్ సునీల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.

ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారం ప్రకారం శేఖర్ కమ్ముల టాప్ టెక్నికల్ టీమ్ ను సిద్ధం చేస్తున్నాడట. తెలుగు, తమిళ్, హిందీ నుండి టాప్ సాంకేతిక నిపుణులను ఈ సినిమా కోసం తీసుకుంటాడని తెలుస్తోంది. మిగిలిన వివరాలు త్వరలోనే తెలుస్తాయి.