శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సరిలేరు నీకెవ్వరూ!

Selfie With Sarileru Neekevvaru Team
Selfie With Sarileru Neekevvaru Team

సూపర్ స్టార్ మహేష్ హీరోగా రష్మిక హీరోయిన్ గా హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు,సుంకర రామబ్రహ్మం, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో శరవేగంగా జరుగుతోంది.. ఫామిలీ ఎంటర్ టైన్మెంట్స్ సీన్స్ ని చిత్రీకరించే పనిలో వున్నారు దర్శకుడు. రష్మిక, సంగీత, బండ్ల గణేష్ హరితేజ తదితరులతో కొన్ని ముఖ్యమైన సీన్స్ చిత్రీకరిస్తున్నారు. చాలా కాలం గ్యాప్ తరువాత విజయశాంతి, సంగీత, బండ్ల గణేష్ ఈ చిత్రంలో నటించడం విశేషం. ఈ మధ్యనే కాశ్మీర్ షెడ్యూల్ పూర్తిచేసిన యూనిట్ ఇప్పుడు హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ జరుపుతుంది.. ఈ షెడ్యూల్ లో మేజర్ తారాగణం అంతా పాల్గొంటున్నారు. సరదాగా షూటింగ్ గ్యాప్ లో చిన్న సెల్ఫీ దిగారు దర్శకుడు.. ఇందులో హీరోయిన్ రష్మిక, సంగీత, హరితేజ, బండ్ల గణేష్ వున్నారు.. చుస్తుంటే బ్లెడ్ బాబ్జి క్యారెక్టర్ లా బండ్ల గణేష్ ధీ ఉంటుందని తెలుస్తోంది.. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫన్నీ క్యారెక్టర్లో బండ్ల గణేష్ ఏమేరకు నవ్విస్తాడో రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.. సంక్రాంతి కానుకగా 2020లో ఈ చిత్రం విడుదలవుతుంది..!