యుగానికి ఒక్కడు సీక్వెల్


Selva raghavan reveals yuganiki okkadu sequel 

2010 లో విడుదలై సూపర్ హిట్ అయిన చిత్రం యుగానికి ఒక్కడు . కార్తీ , రీమా సేన్ , ఆండ్రియా లు నటించిన యుగానికి ఒక్కడు చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది , దాంతో ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచన చేస్తున్నాడు దర్శకుడు సెల్వ రాఘవన్ . టాలీవుడ్ లో సెల్వ రాఘవన్ పలు చిత్రాలు చేసిన విషయం తెలిసిందే . 7/జి బృందావన్ కాలనీ , ఆడవారి మాటలకు అర్దాలే వేరులే చిత్రాలతో విజయాలు అందుకున్నాడు సెల్వ రాఘవన్ . 7/జి బృందావన్ కాలనీ చిత్రంలో నటించిన హీరోయిన్ సోనియా అగర్వాల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అయితే యుగానికి ఒక్కడు సినిమా విడుదల అయ్యాక ఆమెకు విడాకులు ఇచ్చాడు .దాంతో నాలుగేళ్ళ కాపురానికి తెరపడింది .

2011 లో గీతాంజలి రామన్ ని పెళ్లి చేసుకున్నాడు సెల్వ , ఇక యుగానికి ఒక్కడు సినిమా సమయంలో కార్తీ చిన్న హీరో మాత్రమే ! కానీ ఇప్పుడు స్టార్ హీరో తమిళనాట మాత్రమే కాదు టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరో కార్తీ . దాంతో సీక్వెల్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు సెల్వ రాఘవన్ . చోళ రాజుల పరిపాలన అంటే నాకు అమితమైన ఆసక్తి అందుకే యుగానికి ఒక్కడు చిత్రానికి సీక్వెల్ ఆలోచన చేస్తున్నాను అని అంటున్నాడు .

English Title: Selva raghavan reveals yuganiki okkadu sequel