సావిత్రి చేసిన తప్పులకు ఫలితమే ఆమె జీవితమట


senior actor rajesh sensational comments on savitri life

మహానటి చిత్రం విడుదలై సంచలన విజయం సాధిస్తుండటంతో మరోసారి సావిత్రి జీవితం గురించి తెలుసుకోవాలన్న ఆత్రుత నెలకొంది పలువురు నెటిజనులకు దాంతో సావిత్రి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహం నెలకొంది . అయితే సావిత్రి చేసిన తప్పులకు ఫలితంగానే ఆమె జీవితం నాశనం అయ్యిందని అందుకు వేరే వాళ్ళని నిందిచాల్సిన అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు జెమిని గణేశన్ స్నేహితుడు సీనియర్ నటుడు రాజేష్ .

జెమిని గణేశన్ ఎలాంటి వ్యక్తో సావిత్రి కి బాగా తెలుసు , అతడిది చంచల మనస్తత్వం పైగా అప్పటికే పెళ్లి అయి పిల్లలున్న వాడిని ఏరికోరి మరీ పెళ్లి చేసుకుంది . అలాగే ఒకవేళ జెమిని గణేశన్ మద్యం అలవాటు చేసాడే అనుకుందాం అప్పుడు సావిత్రి తన విచక్షణ ఏమైంది అలా మద్యాన్ని కొనసాగించి దానికి బానిస అవ్వడం ఆమె చేసిన తప్పే అని అంటున్నాడు రాజేష్ . జెమిని గణేశన్ స్త్రీ లోలుడు అని తెలిసి పెళ్లి అయిన వాడ్ని చేసుకొని ఇప్పుడు జెమిని గణేశన్ మంచి వాడు కాదని ఎలా అంటామని , ఇవన్నీ ఆలోచించకుండా సావిత్రి చేసిన అన్ని తప్పులకు ఆమె జీవితం బలైందని అంటున్నాడు తమిళ సీనియర్ నటుడు రాజేష్ . ఏది ఏమైనా మహానటి సావిత్రి జీవితం నేటి యువతకు పెద్ద గుణపాఠమే !