సీనియర్ నటి అన్నపూర్ణ కూతురు ఆత్మహత్య


senior actress annapurna daughter keerti commits suicide

వందలాది చిత్రాల్లో పలువురు అగ్ర హీరోలకు తల్లిగా నటించి టాలీవుడ్ అమ్మగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి అన్నపూర్ణ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది . అన్నపూర్ణ కూతురు కీర్తి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది . హైదరాబాద్ బంజారాహిల్స్ లోని అన్నపూర్ణ నివాసంలో ఈ సంఘటన జరిగింది . అన్నపూర్ణ కూతురు కీర్తి గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది దాంతో ఇలా ఆత్మహత్య కు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు .

కీర్తి ఆత్మహత్య విషయం తెలియగానే రంగప్రవేశం చేసిన పోలీసులు డెడ్ బాడీ ని స్వాధీనం చేసుకొని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు . దర్యాప్తు లో అనారోగ్య సమస్యలే ఆత్మహత్య కు కారణమని తెలిస్తే డెడ్ బాడీ ని వెంటనే అన్నపూర్ణ కు అప్పగించనున్నారు . తెలుగులో ఎన్టీఆర్ , ఏఎన్నార్ , కృష్ణ , శోభన్ బాబు లతో పాటుగా చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున, వెంకటేష్ ,మోహన్ బాబు , రాజశేఖర్ ల చిత్రాల్లో ప్రముఖ పాత్రలు పోషించింది అన్నపూర్ణ అయితే ఆమె ఇంట తీవ్ర విషాదం నెలకొనడంతో కన్నీరు మున్నీరు అవుతోంది ఆ కుటుంబం .

English Title: senior actress annapurna daughter keerti commits suicide