అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటి

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది సీనియర్ నటి తనూజ. బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ తల్లి ఈ తనూజ. ఈ సీనియర్ నటి హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించింది. తనూజ వయసు 75 సంవత్సరాలు. తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ముంబై లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

కాజోల్ తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో కన్నీళ్ల పర్యంతం అయ్యింది. ఇటీవలే కాజోల్ మామ వీరు దేవగన్ మరణించిన విషయం తెలిసిందే. మామయ్య మరణంతో దుఃఖసాగరంలో ఉన్న కాజోల్ కు తల్లి కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో ఆమెని ఓదార్చడం అజయ్ దేవగన్ వల్ల కూడా కావడం లేదట.