సీనియర్ నిర్మాత కన్నుమూత


Senior producer kosaraju bhanuprasad passes wayసీనియర్ నిర్మాత భానుప్రసాద్ (84) తుది శ్వాస విడిచారు . చెన్నైలో నిన్న మరణించాడు కొసరాజు భానుప్రసాద్ . తెలుగులో పలు చిత్రాలు నిర్మించిన భాను ప్రసాద్ ప్రముఖ పాటల రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి కుమారుడు . అయితే కొసరాజు రాఘవయ్య చౌదరి పాటల రచయిత కాగా భానుప్రసాద్ మాత్రం తండ్రి బాటలో కాకుండా నిర్మాతగా పరిచయం అయ్యాడు చిత్ర సీమకు . నందమూరి తారకరామారావు హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో ” విశ్వరూపం ” చిత్రాన్ని నిర్మించాడు . ఆ తర్వాత ఓ ఆడది ఓ మగాడు , భోళా శంకరుడు , ప్రియా ఓ ప్రియా తదితర చిత్రాలను నిర్మించాడు .

తెలుగుచిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు తరలివచ్చినప్పటికీ భానుప్రసాద్ మాత్రం చెన్నైలోనే ఉండిపోయాడు . ఉన్నత చదువులు చదివిన భానుప్రసాద్ తండ్రి ప్రభావంతో సినిమాల్లోకి వచ్చాడు . పలు చిత్రాలను నిర్మించాడు . దాసరి నారాయణరావుతో మంచి అనుబంధం ఉంది భానుప్రసాద్ అందుకే ఆయనతోనే రెండు చిత్రాలు చేసాడు . భానుప్రసాద్ మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు .

English Title: Senior producer kosaraju bhanuprasad passes way