సప్తగిరి అత్తగా మాజీ హీరోయిన్

senoir heroine simran in saptagiri movie హాస్య నటుడు సప్తగిరి హీరోగా నటించనున్న చిత్రంలో మాజీ హీరోయిన్ సిమ్రాన్ అత్తగా నటించనుందట . 90 వ దశకంలో స్టార్ హీరోయిన్ గా తెలుగు , తమిళ చిత్రాల్లో సత్తా చాటిన భామ ఈ సిమ్రాన్ . అప్పటి కుర్రకారు గుండెల్లో మంటలు పెట్టిన ఈ భామ అప్పటి స్టార్ హీరోలందరితో నటించింది . కట్ చేస్తే పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు నటనకు గుడ్ బై చెప్పిన ఈ భామ తాజాగా రీ ఎంట్రీ ఇచ్చింది .

అయితే రీ ఎంట్రీ లో అనుకున్న విధంగా మంచి పాత్రలు లభించలేదు అలాగే హిట్ చిత్రాలు కూడా లభించలేదు దాంతో సెలెక్టివ్ గా ఉండాలని భావించిందట సరిగ్గా అలాంటి సమయంలోనే తమిళంలో ఒక చిత్రంలో మంచి పాత్ర లభించగా తెలుగులో సైతం పవర్ ఫుల్ అత్త పాత్ర లభించిందట . ఇందులో కమెడియన్ సప్తగిరి హీరో కాగా అతడికి అత్తగా సిమ్రాన్ నటించనున్నట్లు తెలుస్తోంది . అప్పట్లో అత్తా – అల్లుడు ల మధ్య సాగే డ్రామాతో బోలెడు చిత్రాలు వచ్చాయి సరిగ్గా అలాంటి కథ తోనే సిమ్రాన్ సినిమా చేయనుందట . అంటే తెలుగు తెరకు మరో అత్త లభించినట్లే అన్నమాట .