అమెరికాని వణికించిన సెప్టెంబర్ 11 కు 17 ఏళ్ళు


September 11 attacksసరిగ్గా ఇదే రోజున 17 ఏళ్ల క్రితం కిరాతకమైన తీవ్రవాద సంస్థ ఆల్ ఖైదా అగ్రరాజ్యం అమెరికాని నిలువెల్లా వణికిపోయేలా చేసింది . 2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్ లో ఏకంగా విమానాలను హైజాక్ చేసి నాలుగు చోట్ల మారణహోమం సృష్టించారు . విమానాలను హైజాక్ చేసి వాటిని మానవబాంబులుగా మార్చి ట్విన్ టవర్స్ పై దాడి చేసారు . నాలుగు విమానాలు కూడా స్వల్పకాలిక తేడాలో మారణహోమం సృష్టించాయి . ప్రపంచంలోనే అత్యంత పెద్దవైన ట్విన్ టవర్స్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆ దుమ్ము దూళిలో వేలాది ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి . ఒక్కసారిగా విమానాలతో దాడి చేయడంతో అగ్రరాజ్యం ఖిన్నురాలైంది .

ఆల్ ఖైదా జరిపిన దాడిలో 2996 మంది చనిపోగా ,2977 మంది క్షతగాత్రులయ్యారు ఇక విమానాలను హైజాక్ చేసింది , దాడులకు పాల్పడింది మొత్తం 19 మంది . ఈ సంఘటన జరిగి 16 ఏళ్ళు పూర్తికాగా ఈరోజుతో 17 వ సంవత్సరం లోకి అడుగుపెట్టింది . విమానాల దాడుల తర్వాత అగ్రరాజ్యం అమెరికా ఆల్ ఖైదా ని అంతం చేయడానికి ఎన్నో వ్యూహాలు పన్నింది దాని ఫలితంగా ఒసామా బిన్ లాడెన్ ని దాక్కున్న పాకిస్థాన్ లోనే చంపేసింది . ఇప్పటికి కూడా సెప్టెంబర్ 11 అంటే అమెరికా పౌరులు నిలువెల్లా వణికిపోయేలా చేస్తోంది , అంతటి తీవ్ర ప్రళయాన్ని సృష్టించింది ఆల్ ఖైదా .

English Title: September 11 attacks