ఆ మూడు చిత్రాలు ప్లాప్ అయ్యాయి


September-shok-for-Akkineni-family

సెప్టెంబర్ నెల మా అక్కినేని కుటుంబానికి చాలా ఇష్టమైన నెల అందుకే ఈ నెలలో వచ్చిన మా మూడు చిత్రాలు హిట్ అయ్యాయి అందుకు మీడియా మిత్రులకు , ప్రేక్షక దేవుళ్ళకు నా కృతజ్ఞతలు అంటూ మీడియా ముందుకు వచ్చాడు నాగార్జున. అయితే నాగార్జున గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కినేని ఫ్యామిలీ వాళ్ళు నటించిన మూడు చిత్రాలు కూడా ప్లాప్ అయ్యాయి. సెప్టెంబర్ 13న నాగచైతన్య హీరోగా నటించిన శైలజారెడ్డి అల్లుడు , సమంత కీలక పాత్ర పోషించిన యు టర్న్ చిత్రాలు విడుదల కాగా ఆ రెండు చిత్రాలకు టాక్ బాగానే ఉన్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం రాలేదు దాంతో అవి ప్లాప్ జాబితాలో చేరిపోయాయి.

ఇక నాగార్జున నాని ల మల్టీస్టారర్ చిత్రం దేవదాస్ సెప్టెంబర్ 27న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కూడా డివైడ్ టాక్ వచ్చింది దాంతో వసూళ్లు మందగించాయి. కాకపోతే నాగార్జున -నాని ల మల్టీస్టారర్ చిత్రం కాబట్టి కాస్త మెరుగ్గా వసూళ్లు వచ్చాయి. మొదటి వారంలో 41 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ 22 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది . అంటే బయ్యర్లు లాభల్లోకి రావాలంటే మరో 14 కోట్ల వసూళ్లు రావాలి. ఇక ఇప్పుడు దేవదాస్ వసూళ్లు మెరుగు పడటం కష్టమే ! అయినప్పటికీ మా మూడు చిత్రాలు హిట్ అయ్యాయి అని అంటున్నాడు నాగార్జున . అవి హిట్ కాదు ప్లాప్ చిత్రాలు అని నాగార్జున కు ఎవరు చెబుతారో ? ఏంటో ? అయినా ఓ నాలుగు రోజులు ఆగితే నాగార్జునకు తెలుస్తుంది లే ఆ మూడు కూడా ప్లాప్ అని.

English Title: September shock for Akkineni family