ఈనెల 23న 7 సినిమాల విడుదల !


Seven movies fight for success on 23 rd August
Seven movies fight for success on 23 rd August

ఈనెల 23 న ఏకంగా 7 సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి . ఈనెల 30 న ప్రభాస్ నటించిన సాహో విడుదల అవుతున్న సందర్బంగా 23నే ఎక్కువ చిత్రాలు విడుదల అవుతున్నాయి . ఇక ఒకే వారంలో 7 సినిమాలు విడుదల అంటే వచ్చినవి వచ్చినట్లే వెళ్లిపోవడం ఖాయం . ఒకేరోజున ఇన్ని సినిమాలు విడుదల అయితే కూడా ఆ సినిమా దర్శక నిర్మాతలకు ఇబ్బంది తప్పదు . ఒకేసారి ఇన్ని సినిమాలు విడుదల కావడం వల్ల నష్టం అని తెలిసికూడా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు .

ఇక విడుదల అవుతున్న సినిమాల లిస్ట్ ఇలా ఉంది . కౌసల్య కృష్ణమూర్తి , ఉండిపోరాదే , అశ్వమేథం ,నేనే కేడి నెంబర్ 1, దండుపాళ్యం 4 , పండుగాడు ఫోటో స్టూడియో , బాయ్ . ఈ ఏడు సినిమాలలో కౌసల్య కృష్ణమూర్తి చిత్రానికి మాత్రమే కాస్త మొగ్గు ఉంది ఎందుకంటే తమిళంలో ఆల్రెడీ హిట్ అయిన సినిమా కాబట్టి . ఇక మిగతా సినిమాలపై అంతగా ఆశలు , అంచనాలు లేవు .