47 ఏళ్ల క్రితం రేప్ చేసాడని ఇప్పుడు కేసు పెట్టింది


47 ఏళ్ల క్రితం నన్ను నా మేనమామ అయిన బాలీవుడ్ హీరో రేప్ చేశాడంటూ ఇప్పుడు కేసు పెట్టింది ఓ మేనకోడలు . సంచలనం సృష్టించిన ఈ కేసు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది . ఇంతకీ రేప్ చేసిన బాలీవుడ్ హీరో ఎవరో తెలుసా …….. జితేంద్ర . 1970- 90 వ దశకంలో స్టార్ హీరోగా చెలామణి అయ్యాడు జితేంద్ర . అతడు నటించిన పలు చిత్రాలను తెలుగులో రీమేక్ చేసారు అలాగే మన తెలుగు చిత్రాలను హిందీలో రీమేక్ చేస్తే అందులో నటించాడు ఈ జితేంద్ర . 1971 లో జితేంద్ర తనపై అత్యాచారం చేసాడని అయితే అప్పుడు పరువు పోతుందని భయపడి ఫిర్యాదు చేయలేదని కానీ ఇప్పుడు సోషల్ మీడియా తో పాటు మీ టూ క్యాంపెయిన్ వల్ల ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని అంటోంది జితేంద్ర మేనకోడలు .

ఆడవాళ్ళ పై లైంగిక వేధింపులు అనాదిగా సాగుతూనే ఉన్నాయని , అయితే ఇటీవల ముందుకు వచ్చి పోలీసుల దృష్టికి వస్తున్న సంఖ్యా ఎక్కువగా ఉందని అందుకే నేను కూడా ముందుకు వచ్చినట్లు చెబుతోంది . ఈ కేసు అంతగా తేలదు కానీ జితేంద్ర పరువు మాత్రం పోవడం ఖాయం . ప్రస్తుతం జితేంద్ర వయసు 75 సంవత్సరాలు . ఇక ఫిర్యాదు చేసిన మహిళకు 65 ఏళ్ళు .