రైలులో హీరోయిన్ పై అత్యాచారయత్నం


sexual harrasments on actress sanushaఅత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి , ఎన్ని చట్టాలు తెచ్చినప్పటికీ ఈ అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు తాజాగా రైలు ప్రయాణం చేస్తున్న ఓ హీరోయిన్ పై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు . సంఘటన పూర్వాపరాలలోకి వెళితే …… తమిళంలో రేణిగుంట , భీమ చిత్రాల్లో నటించిన హీరోయిన్ సనూషా బుధవారం రాత్రి కున్నూర్ నుండి తిరువనంతపురం కు ట్రైన్ లో బయలుదేరింది ,రాత్రి పూట కావడంతో నిద్రపోయింది అయితే అదే సమయంలో అంటో బోస్ అనే వ్యక్తి సనూషా పై అత్యచారాయత్నానికి ఒడిగట్టాడు .

తీవ్ర నిద్ర లో ఉన్న సనూషా పై చేతులు బలంగా తాకడంతో నిలువెల్లా వణికిపోయింది వెంటనే తేరుకొని అతడ్ని ఎదురించి టిటి కి సమాచారం అందించడంతో అతడు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసాడు దాంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసారు . తన పై జరిగిన ఈ సంఘటన పట్ల సనూషా ఒకింత షాక్ కి గురయ్యింది . మలయాళ నటి అయినా సనూషా నటించిన రేణిగుంట చిత్రం తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది .