`షాదీ ముబార‌క్‌`: హిలేరియ‌స్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌!

`షాదీ ముబార‌క్‌`: హిలేరియ‌స్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌!
`షాదీ ముబార‌క్‌`: హిలేరియ‌స్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌!

బుల్లితెర న‌టుడు వీర్ సాగ‌ర్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `షాదీ ముబార‌క్‌`. ప‌ద్మ‌శ్రీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దృశ్యా ర‌ఘునాథ్ హీరోయిన్‌గా న‌టించింది. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌తున్న ఈ మూవీని మార్చి 5న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

గురువారం ఈ చిత్ర ట్రైల‌ర్‌ని నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. ఓ ఎన్నారై పెళ్లి గోల నేప‌థ్యంలో ఈ మూవీని ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కించిన‌ట్టుగా క‌నిపిస్తోంది. పెళ్లిచూపుల కోసం ఇండియా వ‌చ్చిన ఓ ఎన్నారై పెళ్లి చూపుల కోసం ఓ ట్యాక్సీ ఎక్క‌డం.. అత‌న్ని పిక‌ప్ చేసుకోవ‌డానికి హీరోయిన్ రావ‌డం.. ఈ జ‌ర్నీలో వీరిద్ద‌రి మ‌ధ్య చిత్ర విచిత్ర‌మైన సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం ఆక‌ట్టుకుంటోంది.

హీరో సున్ని పెంట‌.. హీరోయిన్ తుపాకుల .. ఈ ఇద్ద‌రి మ‌ధ్య సాగే హిలేరియ‌స్ రోమాంటిక్ మూవీ ఇది. ఏదైనా చెప్ప‌డానికి సిగ్గుప‌డే హీరో.. ఏదైనా ఓపెన్‌గా చెప్పేసే హీరోయిన్.. వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ ఎలా చిగురించింది? .. చివ‌రికి వీరి ప్రేమ‌క‌థ ఏతీరానికి చేరింది అన్న‌దే ఇందులో ఆస‌క్తిక‌రం. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఈ మూవీ వుంటుంద‌ని ట్రైల‌ర్‌ని బ‌ట్టి తెలిసిపోతోంది. రాహుల్ రామ‌కృష్ణ‌, హేమ, బెనర్జీ, అదితి మయకల్, అజయ్ ఘోష్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.