అదంతా వట్టి పుకార్లే నట !


Shah Rukh Khan
Shah Rukh Khan

తమిళ స్టార్ హీరో విజయ్ తాజాగా అట్లీ దర్శకత్వంలో బిగిల్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఓ పాటలో నటించనున్నట్లు వార్తలు బాగా స్ప్రెడ్ అయ్యాయి . ముఖ్యంగా తమిళ మీడియా బాగా వైరల్ అయ్యేలా చేసింది అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అవన్నీ వట్టి పుకార్లు మాత్రమే అని అంటున్నాయి ముంబై వర్గాలు .

ఎందుకంటే గతకొంత కాలంగా షారుఖ్ ఖాన్ నటించిన చిత్రాలన్నీ ఘోరంగా దెబ్బతింటున్నాయి దాంతో కొద్దిరోజులు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట ! ఈ విషయాన్నీ ఇటీవలే స్వయంగా వెల్లడించాడు షారుక్ . అంటే విజయ్ సినిమాలో షారుఖ్ లేనట్లే ! విజయ్ – అట్లీ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలకు ఆదరణ ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి .