షారుఖ్ తెలుగు వాళ్ళతోనే సెటిల్ అవుతున్నాడుగా


షారుఖ్ తెలుగు వాళ్ళతోనే సెటిల్ అవుతున్నాడుగా
షారుఖ్ తెలుగు వాళ్ళతోనే సెటిల్ అవుతున్నాడుగా

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సినిమా వస్తోందంటే ఇదివరకు బాక్స్ ఆఫీస్ వద్ద హంగామా మాములుగా ఉండేది కాదు. అతని సినిమాలు ఎలా ఉన్నా మినిమం గ్యారంటీ అన్న తరహాలోనే ఉండేవి. ఇక హిట్ అయిందంటే చెప్పాల్సిన పనేముంది. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల గలగలలే. అయితే గత కొన్నేళ్ల నుండి పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. షారుఖ్ సినిమాలు ఇదివరకటిలా ఆడట్లేదు. అసలు ఈ ఖాన్ బాక్స్ ఆఫీస్ వద్ద తన దమ్ము చూపించి చాలా కాలమే అయింది. ఎంతో నమ్మకం పెట్టుకుని చేసిన సినిమాలు కూడా టపా కట్టేశాయి. దానికి తోడు కొన్ని మూస సినిమాలు కూడా చేసి ప్రేక్షకులకు విసుగు తెప్పించాడు. దీంతో షారుఖ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చేసాడు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న కొన్ని ప్రాజెక్టులను కూడా క్యాన్సిల్ చేసేసాడు. షారుఖ్ ఖాన్ నటించిన లాస్ట్ సినిమా గత క్రిస్మస్ కు విడుదలైంది. మరుగుజ్జు పాత్రలో చేసిన జీరోపై భారీ ఆశలు పెట్టుకున్నాడు షారుఖ్. సల్మాన్ ఖాన్ తో స్పెషల్ రోల్ కూడా వేయించాడు. కానీ ఈ సినిమా కూడా అట్టర్ ప్లాప్ అయింది. జీరోకు వచ్చిన కలెక్షన్స్ చూస్తే ఇది అసలు ఒక టాప్ హీరోకు వచ్చే కలెక్షన్స్ ఏనా అన్న డౌట్ వచ్చేలా పరిస్థితి తయారైంది. అందుకే మరో సినిమా ఒప్పుకోవడానికి చాలా టైమ్ తీసుకున్నాడు.

ఈ గ్యాప్ లో షారుఖ్ చాలానే కథలు విన్నాడు. అయితే ఏదీ ఓకే చేయలేదు. ముఖ్యంగా తమిళ దర్శకులపై ఆసక్తి ప్రదర్శించాడు కింగ్ ఖాన్. శంకర్, అట్లీ, వెట్రిమారన్ ఇలా చాలా మంది తమిళ దర్శకుల పేర్లు వినిపించాయి. అట్లీతో అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అన్నట్లు వార్తలు వచ్చాయి. మొన్న షారుఖ్ ఖాన్ పుట్టినరోజుకి అట్లీ తన భార్యతో కలిసి వెళ్లడంతో అందరూ ఆ వార్తలు నిజమే అని నమ్మారు. తమిళ్ లో ఇప్పటిదాకా 4 సినిమాలు చేసిన అట్లీ సక్సెస్ రేట్ 100 శాతం ఉంది. ముఖ్యంగా విజయ్ తోనే హ్యాట్రిక్ కొట్టడంతో తమిళ్ లో టాప్ డైరెక్టర్ అయిపోయాడు అట్లీ.

కానీ ఇప్పుడు అట్లీతో కాకుండా ముందు తెలుగు దర్శకులతో షారుఖ్ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. రాజ్ అండ్ డీకే అవ్వడానికి తెలుగు వాళ్ళే అయినా ఇక్కడ సినిమాలేవీ డైరెక్ట్ చేయలేదు. డి ఫర్ దోపిడీ అనే సినిమాను నిర్మించారు. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో మళ్ళీ ఇటు తిరిగి చూసింది లేదు. అయితే హిందీలో విభిన్న సినిమాలు తెరకెక్కించే దర్శకులుగా వీరికి మంచి పేరుంది. షోర్ ఇన్ ది సిటీ, గో గోవా గాన్, హ్యాపీ ఎండింగ్ వంటి సినిమాలను తీశారు. రీసెంట్ ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ను కూడా తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు షారుఖ్ తో ఒక సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా తెరకెక్కనుంది. షారుఖ్ ఈ సినిమాను స్వయంగా నిర్మించనున్నాడు.