`జెర్సీ` రీమేక్‌ షూటింగ్‌లో ప్ర‌మాదం!


Shahid kapoor injured at Jersey shoot
Shahid kapoor injured at Jersey shoot

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన చిత్రం `జెర్సీ`. గౌత‌మ్ తిన్న‌నూరి రూపొందించిన ఈ చిత్రం తెలుగులో భారీ విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా విమర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకుంది. న‌టుడిగా నానికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రాన్నిహిందీలో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. `అర్జున్‌రెడ్డి` రీమేక్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్‌ని సొంతం చేసుకున్న షాహీద్‌క‌పూర్ `జ‌ర్సీ` రీమేక్‌లో న‌టిస్తున్నారు. బోనీక‌పూర్‌తో క‌లిసి దిల్‌రాజు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముంబైలోని బాంద్రాలో షాహీద్‌క‌పూర్ పాల్గొన‌గా ప‌లు కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రించారు. ఇటీవ‌ల మొహ‌లీలో జ‌రుగుతున్న షూటింగ్‌లో హీరో షాహీద్‌కు గాయ‌మైన‌ట్టు తెలిసింది. వేగంగా వ‌చ్చిన బంతి హీరో పెద‌వుల‌కు త‌గ‌ల‌డంతో గాయ‌మైన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ర‌క్త స్రావం కావ‌డంతో స‌మీపంలో వున్న ఆసుప‌త్రికి షాహీద్‌ని చిత్ర యూనిట్ తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ ఇప్పించార‌ట‌.

షాహీద్ పెద‌వుల‌కు 13 మూడు కుట్లు ప‌డిన‌ట్టు బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. దీంతో షూటింగ్‌కి మేక‌ర్స్ బ్రేక్ ఇచ్చేశార‌ట‌. క్రికెట‌ర్‌ ర‌మ‌న్ లాంబా బాల్ త‌గ‌ల‌డం వ‌ల్లే మైదానంలోనే ప్రాణాలు వ‌దిలారు. ఆయ‌న జీవిత క‌థ స్ఫూర్తితో `జ‌ర్సీ`ని తెర‌పైకి తీసుకొచ్చార‌ని ప్ర‌చారం జ‌రిగింది.