అర్జున్ రెడ్డి హీరోపై పుకార్లు నిజం కాదట


shahid kapoor reacts on stomach cancer
Shahid kapoor

టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన చిత్రం అర్జున్ రెడ్డి కాగా ఆ చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే . ఆమధ్య కబీర్ సింగ్ ఫస్ట్ లుక్ కూడా విడుదల అయ్యింది , ఆ ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన వచ్చింది . అర్జున్ రెడ్డి గా విజయ్ దేవరకొండ తెలుగులో నటించగా హిందీలో మాత్రం షాహిద్ కపూర్ నటిస్తున్నాడు . ఇక దర్శకత్వం మాత్రం సందీప్ రెడ్డి వంగా నే .

 అయితే షాహిద్ కపూర్ కు పొత్తి కడుపు క్యాన్సర్ అని తెగ రూమర్లు వచ్చాయి . సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారడంతో ఈ విషయం షాహిద్ కపూర్ చెవిన పడింది దాంతో కడుపు మండిన షాహిద్ అవన్నీ గాలి వార్తలే అంటూ కొట్టిపడేసాడు . నాకు ఎలాంటి క్యాన్సర్ లేదు , అసలు ఇలాంటి వార్తలను ఎలా రాస్తారు ? ఎలా స్ప్రెడ్ చేస్తారు ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు . నేను చాలా ఆరోగ్యాంగా ఉన్నాను కాబట్టి మీ సందేహాలకు ఫుల్ స్టాప్ పెట్టండి అంటూ సెలవిస్తున్నాడు . ఇక కబీర్ సింగ్ వచ్చే ఏడాది జూన్ లో విడుదల కానుంది . అర్జున్ రెడ్డి లా అక్కడ కూడా సంచలన విజయం సాధిస్తుందా ? లేదా ? చూడాలి .

English Title: shahid kapoor reacts on stomach cancer