కబీర్ సింగ్ ఎఫెక్ట్ : 35 కోట్లు డిమాండ్


Shahid Kapoor
Shahid Kapoor

కబీర్ సింగ్ ఎఫెక్ట్ తో ఒక్కసారిగా తన రెమ్యునరేషన్ ని అమాంతం పెంచాడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ . నిన్న మొన్నటి వరకు 15 కోట్ల మధ్యలో ఉన్న షాహిద్ కపూర్ రెమ్యునరేషన్ కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ కావడంతో ఏకంగా 30 నుండి 35 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట ఒక్కో చిత్రానికి . అసలు చెప్పాలంటే సోలో హీరోగా షాహిద్ కపూర్ కి హిట్ లేక పదేళ్ల పైనే అవుతోంది .

అయినప్పటికీ కబీర్ సింగ్ పుణ్యమా అని ఏకంగా 35 కోట్లు డిమాండ్ చేస్తున్నాడిప్పుడు . ఎవరూ ఊహించని బ్లాక్ బస్టర్ రావడంతో దాన్ని క్యాష్ చేసుకోవడానికి తన రెమ్యునరేషన్ ని పెంచాడట షాహిద్ . దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కాబట్టి ఇలా ప్లాన్ చేస్తున్నాడు . ఇక కబీర్ సింగ్ పెద్ద హిట్ కావడంతో పెద్ద ఎత్తున దర్శక నిర్మాతలు షాహిద్ కపూర్ ఇంటికి క్యూ కడుతున్నారట . అందుకే ఈ పెంపు అన్నమాట .