భార్యతో గొడవపడితే 15 రోజులు మాట్లాడడట ఈ హీరో


నా భార్యతో గొడవ జరిగితే 15 రోజుల పాటు మాట్లాడటం మానేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసాడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ . తాజాగా ఈ హీరో నటిస్తున్న చిత్రం ” కబీర్ సింగ్ ” . తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేస్తున్నాడు . కాగా ఆ చిత్ర ప్రమోషన్ నిమిత్తం నేహా ధూపియా నిర్వహిస్తున్న ఓ షోలో పాల్గొన్నాడు షాహిద్ , ఆ సందర్బంగా తన భార్య మీరా రాజ్ పుత్ తో గొడవపడితే 15 రోజులు మాట్లాడను అంటూ చెప్పేసాడు .

అయితే 15 రోజుల తర్వాత నేను సర్దుకుపోతాను లేదంటే నా భార్య నాతో రాజీకి వస్తుంది . ఇక అన్యోన్య దాంపత్యం సాగాలంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగువులు రావాల్సిందేనని అప్పుడే ఇద్దరి మధ్య మరింత ప్రేమ పెరుగుతుందని అంటున్నాడు . కబీర్ సింగ్ ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతోంది . దాంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బాగానే పాల్గొంటున్నాడు షాహిద్ కపూర్ .