శైలజారెడ్డి అల్లుడు రివ్యూ


shailaja reddy alludu movie reviewశైలజారెడ్డి అల్లుడు రివ్యూ :
నటీనటులు : నాగచైతన్య , అను ఇమ్మాన్యుయేల్ ,రమ్యకృష్ణ
సంగీతం : గోపీసుందర్
నిర్మాణం : సితార ఎంటర్ టైన్ మెంట్
దర్శకత్వం : మారుతి
రేటింగ్ : 3 / 5
రిలీజ్ డేట్ : 13 సెప్టెంబర్ 2018

నాగచైతన్యఅను ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ప్రధానపాత్రలో నటించిన చిత్రం ” శైలజారెడ్డి అల్లుడు ” . ఈరోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే .

కథ :

ఇగోఇస్ట్ రావు ( మురళీశర్మ ) కొడుకు చైతన్య ( నాగచైతన్య ) అను (అను ఇమ్మాన్యుయేల్ ) ని చూసిన క్షణంలోనే ప్రేమిస్తాడు , అను కూడా చైతూని ఇష్టపడుతుంది కానీ అను కు కూడా ఇగో ఎక్కువ దాంతో చైతూ ప్రపోజ్ చేసేంత వరకు చెప్పదు . తాను ప్రేమించిన అమ్మాయిని తండ్రి కి పరిచయం చేయడంతో తనలాగే తనకు కాబోయే కోడలు కు కూడా ఇగో ఎక్కువ అని తెలియడంతో సంతోషంగా ఒప్పుకుంటాడు అయితే అను తల్లి శైలజారెడ్డి ( రమ్యకృష్ణ ) మాత్రం అను కి మరో సంబంధం చూస్తుంది . శైలజారెడ్డి కి కూడా ఇగో ఎక్కువే కావడంతో ఆమె ఇగో ని శాటిస్ ఫై చేయడానికి చైతూ రంగంలోకి దిగుతాడు . ఇగోఇస్ట్ అయిన శైలజారెడ్డి చైతూ – అనుల పెళ్ళికి ఒప్పుకుందా ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

నాగచైతన్య
రమ్యకృష్ణ
అను ఇమ్మాన్యుయేల్
ఫస్టాఫ్
ఎంటర్ టైన్ మెంట్

డ్రా బ్యాక్స్ :

రొటీన్ స్టోరీ

నటీనటుల ప్రతిభ :

నాగచైతన్య సరికొత్తగా కనిపించాడు , అలాగే అంతకంటే బాగా నటించాడు చైతన్య పాత్రలో . అను ఇమ్మాన్యుయేల్ ఇగో ఉన్న అమ్మాయిగా భేష్ అనిపించింది . ఇక రమ్యకృష్ణ గురించి కొత్తగా చెప్పేదేముంది తనపాత్రకు పరిపూర్ణ న్యాయం చేసింది . పృథ్వీ నవ్వించాడు . అలాగే వెన్నెల కిషోర్ కూడా నవ్వులు పంచాడు . మురళీశర్మ పాత్ర కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది .

సాంకేతిక వర్గం :

నిజార్ షఫీ అందించిన ఛాయాగ్రహణం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . నిర్మాతలు ఖర్చుపెట్టిన దాన్ని స్క్రీన్ మీద మరింత రిచ్ గా కనబడేలా చేసాడు . గోపీసుందర్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది అయితే పాటల పరంగా మాత్రం పూర్తిస్థాయిలో రాణించలేక పోయాడు . సితార ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు మారుతి విషయానికి వస్తే ……. మనుషుల మధ్య ఉన్న ఇగో నేపథ్యంలో ఈ కథ ని రాసుకున్నాడు , కొంతవరకు ఎంగేజ్ చేయగలిగాడు కానీ పూర్తిస్థాయిలో మాత్రం ఆకట్టుకునేలా రూపొందించలేకపోయాడు . మరింత హాస్యం , సెంటిమెంట్ తోడైతే తప్పకుండా ఈ సినిమా మరో లెవల్ కి వెళ్ళేది .

ఓవరాల్ గా :

తప్పకుండా ఓసారి చూడొచ్చు

                                      Click here for English Review