శైలజారెడ్డి అల్లుడు వాయిదపడింది


Shailajareddy release postponedవిడుదల చేయబోతున్నట్లు చాలారోజుల క్రితమే ప్రకటించారు. సినిమా విడుదలకు చాలా సమయం ఉంది కాబట్టి అనుకున్నట్లుగానే విడుదల అవుతుందని అనుకున్నారు కట్ చేస్తే తీరా సమయానికి నేపథ్య సంగీతం పూర్తికాలేదు దానికి తోడు కేరళలో భారీ వర్షాల వల్ల మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తుండటంతో రిస్క్ ఎందుకని సినిమా విడుదల వాయిదా వేశారు.

సినిమా వాయిదపడింది కాబట్టి రిలీజ్ ఎప్పుడు అనేది మళ్లీ తెలియజేస్తామని ప్రకటించాడు నాగచైతన్య. బహుశా సెప్టెంబర్ మొదటి వారంలోనే విడుదల ఉంటుంది కాకపోతే ఒకసారి డిస్కస్ చేసుకొని ఆ ప్రకటించనున్నారు. శైలజారెడ్డి గా రమ్యకృష్ణ నటిస్తుండగా ఆమె కూతురు గా అను ఇమాన్యుఎల్ నటిస్తోంది. మారుతి మార్క్ ఎంటర్ టైన్ మెంట్ తో ఈ సినిమా ఉంటుందట . ఇక నాగార్జున నటించిన అల్లరి అల్లుడు సినిమాలాగా వినోద ప్రధానంగా తెరకెక్కిందని అంటున్నారు. అత్తా – అల్లుడు కాన్సెప్ట్ లో వచ్చిన చిత్రాలు 80-90 వ దశకంలో సంచలనం సృష్టించాయి . మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్దిరోజులు ఎదురుచూడాల్సిందే.

English Title: shailajareddy release postponed