షకలక శంకర్ తప్పు చేశాడా


shakalaka shankar blunder mistake with shambo shankaraజబర్దస్త్ కార్యక్రమంతో వెలుగులోకి వచ్చాడు షకలక శంకర్ , అయితే అంతకంటే ముందే పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు అంతేకాదు పలువురు సినీ ప్రముఖుల దగ్గర పనిచేసాడు కూడా . కానీ జబర్దస్త్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు , దాంతో పలు చిత్రాల్లో హాస్య పాత్రలకు షకలక శంకర్ ని ఎంచుకున్నారు . తన కామెడీ తో బుల్లితెర ప్రేక్షకులను మాత్రమే కాకుండా వెండితెర ప్రేక్షకులను కూడా అలరించాడు కట్ చేస్తే ….. …. తాజాగా ” శంభో శంకర ” చిత్రంతో హీరోగా మారాడు . తన స్నేహితుడు శ్రీధర్ దర్శకత్వంలో తెరకెక్కిన శంభో శంకర చిత్రం నిన్న విడుదల అయ్యింది .

హీరోగా షకలక శంకర్ బాగానే నటించాడు , నటనలో , డ్యాన్స్ లో , ఫైట్స్ లో కూడా అదరగొట్టాడు అందులో అనుమానం లేదు కానీ సరైన కథ , కథనం లేకుండా పోవడంతో శంకర్ చేసింది తప్పా ? అన్న చర్చ జరుగుతోంది . ఇప్పటికే పలువురు హాస్య నటులు హీరోలుగా నటించారు అయితే అందరూ సక్సెస్ కాలేదు ఒకవేళ హిట్ కొట్టినా అది తాత్కాలికమే . అటు హాస్య పాత్రలు చేసుకోలేక ఇటు హీరోగా సక్సెస్ కొట్టలేక చతికిల బడిన వాళ్ళు ఎందరో ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో. శంకర్ కూడా హాయిగా హాస్య పాత్రలు చేసుకోక ఇలా హీరోగా అవతారం ఎట్టి తప్పు చేసాడు అని అంటున్నారు పలువురు సినీ ప్రముఖులు . కమెడియన్ గా కొనసాగినట్లైతే హాయిగా వేషాలు వచ్చేవని ,కానీ హీరోగా నటించి తన కెరీర్ ని రిస్క్ లో పెట్టుకున్నాడని వాపోతున్నారు .