పాపం ! షకలక శంకర్


జబర్దస్త్ తో వెలుగులోకి వచ్చిన హాస్య నటుడు షకలక శంకర్ . తాజాగా హీరోగా నటిస్తున్నాడు కూడా . ఎంచక్కా ఆరోగ్యంగా ఉన్న షకలక శంకర్ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో అది శంకర్చెవిన పడింది ఇంకేముంది ఆగ్రహంతో ఊగిపోయాడు అంతేనా ! శ్రీకాకుళం యాసలో తిట్ల దండకం అందుకున్నాడు కూడా .

జబర్దస్త్ కంటే ముందు పలు చిత్రాల్లో చిన్న చిన్న వేషాలు వేసాడు షకలక శంకర్ కానీ అంతగా గుర్తింపు రాలేదు పాపం . ఎప్పుడైతే జబర్దస్త్ కార్యక్రమం స్టార్ట్ అయ్యిందో అప్పటి నుండి షకలక శంకర్ కు విపరీతమైన పేరు ప్రఖ్యాతులు వచ్చాయి దాంతో ఇప్పుడు ఏకంగా హీరోగా నటిస్తున్నాడు . కొంతమంది వేషాలు ఇస్తామని గంటల తరబడి , రోజుల తరబడి ఎదురు చూసేలా చేసాడట ! దాంతో ఆగ్రహంతో తనని నమ్మి వచ్చే వాళ్లతో కలిసి హీరోగా సినిమాలు చేస్తున్నాడు . అయితే శంభో శంకర సినిమా ప్లాప్ అయినప్పటికీ ప్రస్తుతం రెండు సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు . అయితే ఈలోపు షకలక శంకర్ చనిపోయాడు అంటూ ప్రచారం చేయడంతో కోపంతో ఊగిపోయాడు . సోషల్ మీడియాలో వాస్తవాలను పక్కన పెట్టి దుష్ప్రచారం ఎక్కువగా చేస్తున్నారు దాంతో పలువురు సెలబ్రిటీ లు ఇబ్బంది పడుతున్నారు .