`ష‌కీలా` బ‌యోపిక్ తెలుగు ట్రైల‌ర్ వ‌చ్చేసింది!‌


`ష‌కీలా` బ‌యోపిక్ తెలుగు ట్రైల‌ర్ వ‌చ్చేసింది!‌
`ష‌కీలా` బ‌యోపిక్ తెలుగు ట్రైల‌ర్ వ‌చ్చేసింది!‌

ద‌క్షిణాదిని 90వ ద‌శ‌కంలో ఓ ఊపు ఊపేసిన శృంగార తార ష‌కీలా. ఆమె జీవిత‌క‌థ ఆధారంగా మ‌ల‌‌యాళ ద‌ర్శ‌కుడు ఇంద్ర జిత్ లంకేష్ `ష‌కీలా` చిత్రాన్ని తెర‌కెక్కించారు. శృంగార చిత్రాల‌తో మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం సృష్టించింది. ఆమె సినిమాల ధాటికి త‌ట్టుకోలేక స్టార్ హీరోలు సైతం త‌మ సినిమా రిలీజ్‌ల‌ని వాయ‌దా వేసుకునే వారంటే ష‌కీలా ఏ స్థాయిలో ప్ర‌భావాన్ని చూపించిందో అర్థం చేసుకోవ‌చ్చు. ‌

ఆమె జీవిత క‌థ ఆధారంగా `ష‌కీలా` చిత్రాన్ని ఇంద్ర‌జిత్ లంకేష్ తెర‌కెక్కించారు. బాలీవుడ్ హీరోయిన్ రిచా చ‌ద్దా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది. పంక‌జ్ త్రిపాఠి కీల‌క పాత్ర‌లో న‌టించారు. 1000 అబ‌ద్ధాలు, భీమవ‌రం బుల్లోడు చిత్రాల ఫేమ్ ఏస్త‌ర్ మ‌రో పాత్ర‌లో న‌టించింది. ఈ శుక్ర‌వారం హిందీలో విడుద‌లైన ఈ చిత్రం తెలుగులో జ‌న‌వ‌రి 1న విడుద‌ల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర తెలుగు ట్రైల‌ర్‌ని చిత్ర బృందం శ‌నివారం విడుద‌ల చేసింది.

నాట‌కాలంటే అభిమానంతో న‌టించ‌డం మొద‌లుపెట్టిన ష‌కీలా ఎలా అవ‌కాశాలు ద‌క్కించుకుంది? ఆమె కెరీర్‌లో ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది? ఒకానొక ద‌శ‌లో అగ్ర హీరోలు ష‌కీలా చిత్రాల‌ని ఎందుకు బ్యాన్ చేయాల‌నుకున్నారు?.. ష‌కీలా జీవితంలో జ‌రిగిన ప్ర‌తీ విష‌యాన్ని చ‌ర్చిస్తూ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్టుగా తెలుస్తోంది.