బాలీవుడ్ నటి వల్లే స్మోకింగ్.. 30 ఏళ్ల నుంచి మానలేకపోతున్నా: షకీలా


బాలీవుడ్ నటి వల్లే స్మోకింగ్.. 30 ఏళ్ల నుంచి మానలేకపోతున్నా: షకీలా
బాలీవుడ్ నటి వల్లే స్మోకింగ్.. 30 ఏళ్ల నుంచి మానలేకపోతున్నా: షకీలా

ఒకప్పుడు షకీలా సినిమా వస్తోంది అంటే మలయాళం ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు కూడా వాయిదా పడేవి. అంతలా అడల్ట్ సినిమాలతో ఒక ట్రెండ్ సెట్ చేసిన షకీలా ఇప్పుడు అవకాశాలు లేక సతమతమవుతోంది. అయితే పర్సనల్ లైఫ్ లో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్న షకీలా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి పూజా భట్ పై ఎవరు ఊహించని కామెంట్స్ చేసింది. తనకు సిగరెట్ అలవాటు కావడానికి ఆమె ప్రధాన కారణమని షకీలా వివరణ ఇచ్చింది.

చెన్నైలో ఒకసారి షూటింగ్ సమయంలో అనుకోకుండా పూజాని చూసిన షకీలా ఆమె స్మోకింగ్ స్టైల్ ని చూసి షాకయ్యిందట. పూజా భట్ పిలిచి తనకు సిగరెట్ తాగమని ఇచ్చిందని చెప్పిన షకీలా స్టైల్ గా అనిపించడంతో సిగరెట్ తాగినట్లు చెప్పింది. ఆ విధంగా ఆ రోజు నుంచి మొదలుపెట్టిన స్మోకింగ్ ఇప్పటివరకు కూడా ఆగలేదట. తెలియకుండా సిగరెట్ తాగడం అలవాటైంది. 30 ఏళ్ల నుంచి మానలేకపోతున్నా అని షకీలా వివరణ ఇచ్చింది. అలాగే తన ఇన్నేళ్ల కెరీర్ లో ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా ఎవరిని పెళ్లి చేసుకోవాలని అనిపించలేదని చెబుతూ.. ఒకరిని మాత్రం నిజంగా ప్రేమించనాని అయితే మా అమ్మతో గొడవ కారణంగా అతన్నీ పెళ్లి చేసుకోవలేదని షకీలా వివరణ ఇచ్చింది.