మహేష్ సరసన అర్జున్ రెడ్డి లవర్


shalini pandey romance with mahesh babu

మహేష్ బాబు తాజాగా భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ చిత్రం ఈనెల 20న భారీ ఎత్తున విడుదల అవుతోంది ఇక ఆ సినిమా విడుదల అయ్యాక కొంత గ్యాప్ తీసుకొని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నాడు . మహేష్ బాబు 25 వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాతలు అశ్వనీదత్ – దిల్ రాజు లు సంయుక్తంగా నిర్మించనున్నారు . ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా మరో భామని కూడా తీసుకున్నారట .

అయితే ఆ భామ మరెవరో కాదు అర్జున్ రెడ్డి ప్రియురాలు షాలిని పాండే . మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే కాగా రెండో హీరోయిన్ గా షాలిని పాండే నటించనున్నట్లు తెలుస్తోంది . అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ భామకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి . ఇక ఇప్పుడేమో ఏకంగా మహేష్ లాంటి స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ రావడం అంటే షాలిని పాండే దశ తిరిగినట్లే !