భారీ బాలీవుడ్ ఆఫర్ ను పట్టేసిన అర్జున్ రెడ్డి భామ


shalini pandey bollywood movie
భారీ బాలీవుడ్ ఆఫర్ ను పట్టేసిన అర్జున్ రెడ్డి భామ

అర్జున్ రెడ్డి సినిమాతో బోల్డ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న షాలిని పాండే, ఎందుకనో తెలుగులో మంచి సినిమాలను పట్టలేకపోయింది. అలా అని ఈ భామ ఏమీ నిరాశ చెందలేదు. తన అందంపై దృష్టి పెట్టింది. ఫిట్నెస్ ను పెంచుకుంది. ఈ నేపథ్యంలో భారీ బాలీవుడ్ ఆఫర్ ను తన ఖాతాలో వేసుకున్నట్లు తెలుస్తోంది.

హిందీలో హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన యష్ రాజ్ సంస్థతో మూడు సినిమాల కాంట్రాక్ట్ సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక సినిమాలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించనున్నట్లు సమాచారం. ఈ మూడు సినిమాల్లో ఏది హిట్ అయినా షాలిని బాలీవుడ్ లో పాగా వేయడం ఖాయంగా కనిపిస్తోంది.