కోరిక తీరిస్తే విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ అట !


నా కోరిక తీరిస్తే విజయ్ దేవరకొండ హీరోగా నటించే సినిమాలో ఛాన్స్ ఇస్తానని ఓ దర్శకుడు అన్నాడని సంచలన ఆరోపణలు చేస్తోంది తమిళ నటి శాలు శమ్ము . తమిళంలో పలు చిత్రాల్లో నటించిన ఈ భామకు వెండితెర పై రాణించాలని కోరికగా ఉంది దాంతో ఆమె బలహీనతలను ఆసరాగా చేసుకున్న ఓ దర్శకుడు విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ ఇస్తా కాకపోతే నా కోరిక తీర్చాలని షరతు పెట్టాడట .

విజయ్ దేవరకొండ అంటే క్రేజ్ ఉన్న హీరో దాంతో పలువురు టెంప్ట్ అవుతుంటారు కానీ ఈ శాలు శమ్ము మాత్రం నో చెప్పిందట ! అయితే ఆ దర్శకుడు ఎవరు ? అన్నది మాత్రం పేరు చెప్పడం లేదు . ఒకవేళ నేను ఆ దర్శకుడి పేరు చెబితే అతను నేను కోరిక కోరింది నిజమే అని ఒప్పుకుంటాడా ? అంటూ ఎదురు ప్రశ్న వేస్తోంది కూడా . ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని , మీటు అనుభవం నాకు కూడా ఎదురయ్యిందని అయితే దాన్ని ఎలా అధిగమించడం అనేది మన చేతుల్లోనే ఉంటుందని అంటోంది . అయితే విజయ్ దేవరకొండ ని అడ్డుపెట్టుకొని ఇలా వ్యవహరించింది ఎవరై ఉంటారబ్బా !