కోటి షేర్ సాధించిన శంభో శంకర


shambo shankara first week share 1 croreషకలక శంకర్ హీరోగా నటించిన శంభో శంకర చిత్రం కోటి రూపాయల షేర్ సాధించడం సంచలనంగా మారింది . కమెడియన్ గా కెరీర్ ని ప్రారంభించిన షకలక శంకర్ అనూహ్యంగా శంభో శంకర చిత్రంతో హీరోగా పరిచయమై షాక్ ఇచ్చాడు . పైగా అతడు హీరోగా మారడానికి తెరవెనుక పెద్ద మంత్రాంగమే నడిచిందని శంకరే స్వయంగా వెల్లడించాడు . ఎన్నో కష్టాలు పడి సినిమా అయితే చేసారు కానీ అనుకున్న స్థాయిలో మాత్రం విజయం సాధించలేదు .

శంకర్ ని స్టార్ హీరో రేంజ్ లో చూపించాడు దర్శకుడు శ్రీధర్ అయితే అనుకోని కథనం తో కాస్త నీరసించి పోయింది అయితే శంభో శంకర్ సినిమాతో పాటు విడుదలైన సినిమాలన్నీ ప్లాప్ బాట పట్టడంతో శంభో శంకర చిత్రానికి కలిసొచ్చింది . మాస్ ప్రేక్షకులను అలరించే అంశాలు ఉండటంతో మంచి వసూళ్లు వస్తున్నాయి . మొదటి వారంలో ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కోటి రూపాయల షేర్ వచ్చింది దాంతో ట్రేడ్ విశ్లేక్షకులు సైతం ఆశ్చర్యానికి లోనౌతున్నారు .

వై . రమణారెడ్డి – సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం శంకర్ కు హిట్ ని ఇవ్వలేదు కానీ మంచి ఓపెనింగ్స్ ని మాత్రం సాధించి పెట్టింది . ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ కోటి రూపాయల షేర్ రావడం మామూలు విషయం కాదు . అయితే రెండో వారంలో మాత్రం ఆ కలెక్షన్లు పడిపోవడం ఖాయం .