కలిసి రాని శనివారం.ఇక రెండు సినిమాలు ఇంటికే….

Chanakya-Oorantha-Anukuntunnaru
Chanakya-Oorantha-Anukuntunnaru

శనివారం రోజు  సినిమా రిలీజ్ సెంటిమెంట్ పెద్దగా సాదించింది లేదు. శుక్రవారం మంచి రోజు లేకపోతే శనివారం రిలీజ్ చేసేవారు. అలా చూసుకున్నా సినిమాలు ఆడలేదు. కారణం శనివారం సెంటిమెంట్ అని చెప్పవచ్చు. చరిత్ర కూడా చూసుకుంటే శనివారం రోజు రిలీజ్ అయిన సినిమాలు హిట్ అయిన వాటికంటే ఫ్లాప్ అయ్యి ఇంటికి పోయినవే ఎక్కువగా ఉన్నాయి.

అలా నిన్న విడుదల అయిన ‘చాణక్య‘ మరియు ‘ఊరంతా అనుకుంటున్నారు’ సినిమాలు కూడా విడుదల అయ్యాయి. వెంటనే ఫ్లాప్ టాక్ రావడంతో థియేటర్లు దగ్గర జనాలు లేక విల విల లాడుతున్నాయి. చాణక్య సినిమా మీద గోపీచంద్ అభిమానులకి చాలా నమ్మకం ఉంది. అయినా కూడా సినిమాలో దమ్ము లేక అతని అభిమానులు చూడలేని పరిస్థితోలో ఉంది ఆ సినిమా. ఇక ఊరంతా అనుకుంటున్నారు సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

నరేష్ కొడుకు నవీన్ కృష్ణ మొదటి ప్రయత్నం ‘నందిని నర్సింగ్ హోమ్’ లాగానే రెండవ సినిమా ఊరంతా అనుకుంటున్నారు కూడా ఘోర పరాజయాన్ని ఇచ్చింది. నటుడుగా చాలా మంచి పేరు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా కూడా మారి 2 విజయవంతమయిన సినిమాలని దర్శకత్వం చేసిన అనుభవంతో  ఈ కథని ఎలా నమ్మారు? ఎందుకు అనవసరంగా నటించారు అని అతని అభిమానులు అనుకుంటున్నారు.

చిరంజీవి సినిమా ‘సైరా’ సినిమాకి టిక్కెట్ దొరకని జనాల వారు ఈ రెండు సినిమాలకి వెళ్లారు. అలా వెళ్లిన వాళ్ళు సినిమాల గురించి ఘోరంగా మాట్లాడటం చూసి చెప్పవచ్చు సినిమాలు అలా ఉన్నాయని. గోపీచంద్ చేతిలో ఇప్పటికి రెండు సినిమాలు ఉన్నాయి…అందులో నుండి అయినా ఫ్లాప్ టాక్ నుండి బయట పడతారో లేదో? ఇక నవీన్ కృష్ణ నటనలో ఇంకా ట్రైనింగ్ తీసుకోవాలి అని అంటున్నారు సినిమా వర్గాల వాళ్ళు..