
దక్షిణాదిలో సెన్సేషనల్ డైరెక్టర్‌గా శంకర్‌కు ఓ ప్రత్యేక స్థానం వుంది. ఆయన డైరెక్షన్లో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ పాన్ ఇండియా మూవీని చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనని ఇటీవల మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ మూవీ సెట్స్‌పైకి రానుంది. ఇదిలా వుంటే సమకాలీన రాజకీయాంశాల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. శంకర్ గత చిత్రాల తరహాలో భారీ తనం కనిపించినా ఆయన మార్కు సెట్స్.. అదనపు గ్రాఫక్స్ అంటూ ఏమీ వుండవని, సమకాలీన రాజకీయ అంశాల్ని ప్రధాన వస్తువుగా తీసుకుని శంకర్ ఈ చిత్రాన్ని చేయబోతున్నారని చెబుతున్నారు.
బడ్జెట్ కూడా గత చిత్రాల తరహాలో అదుపు తప్పకుండా అనవసరమైన ఖర్చులకు తావులేకుండా ఈ మూవీని పూర్తి చేయాలని శంకర్, దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం కమల్‌హాసన్ హీరోగా శంకర్ `ఇండియన్ 2`ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తరువాతే రామ్‌చరణ్ చిత్రం పట్టాలెక్కనుందని తెలిసింది.