య‌ష్‌తో శంక‌ర్ భారీ చారిత్రాత్మ‌క చిత్రం?

య‌ష్‌తో శంక‌ర్ భారీ చారిత్రాత్మ‌క చిత్రం?
య‌ష్‌తో శంక‌ర్ భారీ చారిత్రాత్మ‌క చిత్రం?

ద‌క్షిణాదిలో వున్న స్టార్ డైరెక్ట‌ర్ల‌లో శంక‌ర్‌ది ప్ర‌త్యేక శైలి. భారీ స్పాన్ వున్న చిత్రాల‌కు ఆయ‌న కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచారు. ఆ స్థానాన్ని ఇటీవ‌ల `బాహుబ‌లి` సిరీస్‌తో రాజ‌మౌళి ఆక్ర‌మించారు. దీంతో మ‌ళ్లీ త‌న స‌త్తాని పాన్ ఇండియా స్థాయిలో చాటుకోవాల‌ని శంక‌ర్ ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ప్ర‌స్తుతం క‌మ‌ల్‌హాస‌న్‌తో `ఇండియ‌న్‌` చిత్రానికి సీక్వెల్‌గా `ఇండియ‌న్ 2`ని శంక‌ర్ ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే.

ఇటీవ‌ల క్రేన్ యాక్సిడెంట్ తో పాటు క‌రోనా కార‌ణంగా షూటింగ్‌ని నిలిపివేశారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత శంక‌ర్ భారీ స్థాయిలో చారిత్రాత్మ‌క చిత్రాన్ని తెర‌కెక్కించ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో `కేజీఎఫ్` ఫేమ్ పాన్ ఇండియా స్టార్ య‌ష్ న‌టించ‌నున్నార‌ట‌. ఇప్ప‌టికే ఆయ‌న‌కు క‌థ వినిపించార‌ని, య‌ష్ కూడా ప‌చ్చ జెండా ఊపేశార‌ని తెలిసింది.

భారీ వార్ డ్రామాగా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని దాదాపు 4 ఏళ్ల పాటు చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. 2026 లేదా 27 ప్ర‌ధ‌మార్థంలో ఈ మూవీని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానున్న ఈ చిత్రంలోని ఓ కీల‌క పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తిని ఖ‌రారు చేశార‌ట‌. మిగ‌తా కీల‌క పాత్ర‌ల్లో భార‌తీయ భాష‌ల‌కు చెందిన ప్ర‌ముఖ స్టార్స్ న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఈ నెల‌లోనే రానున్న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌.