లీగ‌ల్ చిక్కుల్లో శంక‌ర్ `అప‌రిచితుడు`!

shankar anniyan remeke in leagal trouble
shankar anniyan remeke in leagal trouble

గ‌త కొంత కాలంగా అగ్ర ద‌ర్శ‌కుడు శంక‌ర్ లీగ‌ల్ చిక్కుల్ని ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయ‌న మ‌రోసారి లీగ‌ల్ స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్న‌ట్టు తెలిసింది. వివ‌రాల్లోకి వెళితే… చియాన్ విక్ర‌మ్ హీరోగా 2005లో వి. ర‌విచంద్ర‌న్ నిర్మించిన త‌మిళ‌ చిత్రం `అన్నియ‌న్‌`. స‌దా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం తెలుగులో `అప‌రిచితుడు` పేరుతో విడుద‌లై రెండు భాష‌ల్లోనూ సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

16 ఏళ్ల త‌రువాత ఈ చిత్రాన్ని హిందీలో ర‌ణ్‌వీర్‌సింగ్‌తో రీమేక్ చేస్తున్నారు. బుధ‌వారం ఈ మూవీ రీమేక్‌ని ప్ర‌క‌టించారు. డా. జ‌యంతిలాల్ గ‌డ ఈ మూవీని రీమేక్ చేయ‌బోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ని ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించిన శంక‌ర్`ఈ క్షణంలో నా క‌న్నా సంతోషించే వ్య‌క్తి మ‌రొక‌రు వుండ‌రు. ర‌ణ్‌వీర్‌తో `అన్నియ‌న్‌`ని అధికారికంగా రిమేక్ చేయ‌బోతున్నాం` అని ప్ర‌క‌టించారు. అయితే నిర్మాత‌ని వి. ర‌విచంద్ర‌న్‌ని మాత్రం రీమేక్ విష‌యంలో సంప్ర‌దించ‌లేద‌ట‌. దీంతో ఆయ‌న ఈ విష‌యం తెలిసి షాక్ కు గుర‌య్యాన‌ని పేర్కొన్నారు.

`అన్నియన్ అనే సినిమా కథను అడాప్ట్ చేసుకుని మీరు హిందీ చిత్రానికి దర్శకత్వం వహించ‌బోతున్నార‌ని తెలిసి నేను పూర్తిగా షాక్ అయ్యాను. నేను చెప్పిన `అన్నీయన్` చిత్రానికి నిర్మాతని నేను అనే విషయం మీకు బాగా తెలుసు. మొత్తం కథల రీమేక్‌ హక్కులను రచయిత సుజాత (అలియాస్ దివంగత రంగరాజన్) నుండి నేను కొనుగోలు చేసాను. దాని కోసం నేను అతనికి పూర్తిగా చెల్లింపు చేశాను. దానికి సంబంధించిన అవసరమైన రికార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. కథాంశం యొక్క హక్కులకు సంబంధించి ఏకైక యజమాని నేను. అందుకని నా అనుమతి లేకుండా `అన్నీయ‌న్‌` సినిమా  ప్రధాన కథనాన్ని ఎలాంటి అనుసరణ లేదా రీమేక్ చేయడం లేదా కాపీ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం` అని నిర్మాత ర‌విచంద్ర‌న్ వెల్ల‌డించారు. దీంతో `అన్నీయన్` హిందీ రీమేక్ లీగ‌ల్ చిక్కుల్లో ప‌డింది.