ర‌విచంద్ర‌న్ ఆరోప‌ణ‌ల‌పై శంక‌ర్ రిప్లై!

ర‌విచంద్ర‌న్ ఆరోప‌ణ‌ల‌పై శంక‌ర్ రిప్లై!
ర‌విచంద్ర‌న్ ఆరోప‌ణ‌ల‌పై శంక‌ర్ రిప్లై!

చియాన్ విక్ర‌‌మ్ హీరోగా న‌టించ‌గా 2005లో శంక‌ర్ తెర‌కెక్కించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `అన్నీయ‌న్‌`. ఆస్కార్ ర‌విచంద్ర‌న్ నిర్మించిన ఈ మూవీ తెలుగులో `అప‌రిచితుడు` పేరుతో రిలీజ్ చేశారు. రెండు భాష‌ల్లోనూ ఈ మూవీ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. దాదాపు 16 ఏళ్ల విరామం త‌రువాత ఈ మూవీని హిందీలో ర‌ణ్‌వీర్‌సింగ్ హీరోగా రీమేక్ చేస్తున్న‌ట్టు ఈ బుధ‌వారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

అయితే త‌న‌ని సంప్ర‌దించ‌కుండా హిందీ రీమేక్ చేయ‌డానికి శంక‌ర్ పూను కోవ‌డం చ‌ట్ట విరుద్ధ‌మ‌ని, ఈ చిత్రానికి నేను నిర్మాత‌న‌నే విష‌యం మీకు తెలుస‌ని, తెలిసి కూడా మీరు ఇలాంటి నీతిమాలిన ప‌నుల‌కు ఉప‌క్ర‌మిస్తార‌ని తాను భావించ‌లేద‌ని, త‌న అనుమ‌తి తీసుకోకుండా రీమేక్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం పూర్తిగా అన్యాయం అని నిర్మాత ర‌విచంద్ర‌న్ శంక‌ర్‌పై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.

దీనిపై శంక‌ర్ కూడా అదే స్థాయిలో స్పందించారు. 14న మీరు నాకు పంపించిన ఈ మెయిల్‌లో `అన్నీయ‌న్` సినిమా క‌థాంశం మీదేన‌ని పేర్కొన‌డంతో నేను షాక్‌కు గుర‌య్యాను. `అన్నియ‌న్‌` చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్‌పై పూర్తి హ‌క్కులు నావే. క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైరెక్ష‌న్ నా పేరుతోనే సినిమా విడుద‌లైంది. పైగా మీకు క‌థ హ‌క్కులు అమ్ముతున్న‌ట్లు నేను ఎలాంటి ప‌త్రం రాసి ఇవ్వ‌లేదు. నేను రాసిన క‌థ‌లో ఎవ‌రి పాత్రా లేదు. ఇది కేవ‌లం దుర‌ద్దేశంతో .. ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తున్న ఆరోప‌ణ‌లు` అంటూ శంక‌ర్ స‌మాధానం చెప్పారు.