శంక‌ర్ పై కోర్టుకెక్కిన లైకా ప్రొడ‌క్ష‌న్స్‌!

 

Shankar vs Lyca productions
Shankar vs Lyca productions

శంక‌ర్.. దేశ వ్యాప్తంగా భారీ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచి యావ‌త్ దేశం ద‌క్షిణాది వైపు చూసేలా చేసిన ద‌ర్శ‌కుడాయ‌న‌. `జెంటిల్‌మెన్‌`తో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన శంక‌ర్ కెరీర్ `రోబో` త‌రువాత దారి త‌ప్పుతూ వ‌స్తోంది. ఆయ‌న కుడి భుజం, రైట‌ర్ సుజాత చ‌నిపోయిన ద‌గ్గ‌రి నుంచి శంక‌ర్ ఏది చేసినా క‌లిసి రావ‌డం లేదు. అన్నీ ఎదురుదెబ్బ‌లే.

500 కోట్ల బ‌డ్జెట్‌తో చేసిన `2.ఓ` దారుణంగా ఫ్లాప్ కావ‌డం.. క‌మ‌ల్‌హాసన్‌తో మొద‌లుపెట్టిన `ఇండియ‌న్‌2` సెట్‌లో క్రేన్ కూలి డైరెక్ష‌న్ టీమ్‌తో పాటు ప్రొడ‌క్ష‌న్ బాయ్‌తో స‌హా ముగ్గురు చ‌నిపోవ‌డం వంటి కార‌ణాల‌తో శంక‌ర్ తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ మూవీ షూటింగ్ సంద‌ర్భంగా లైకా ప్రొడ‌క్ష‌న్స్‌కి శంక‌ర్‌కి మ‌ధ్య చెల‌రేగిన వివాదం రామ్‌చ‌ర‌ణ్ తో శంక‌ర్ ప్ర‌క‌టించిన సినిమాపై ప‌డేలా వుంది. `ఇండియ‌న్ 2`ని పునః ప్రారంభించ‌నుండా శంక‌ర్ మ‌రో చిత్రాన్ని ప్ర‌క‌టించ‌డం ఏంట‌ని లైకా చెన్నై హైకోర్టుని ఆశ్ర‌యించిన‌ట్టు తెలిసింది.

ఇప్ప‌టికే 180 కోట్లు ఖ‌ర్చు చేశాం. త‌న రెమ్యున‌రేష‌న్ బ్యాలెన్స్ ఇచ్చేస్తాం. `ఇండియ‌న్ 2` షూటింగ్‌ని  శంక‌ర్ మొద‌లుపెట్టాల‌ని కోర్టుని ఆశ్ర‌యించింది. ఈ నేప‌థ్యంలో శంక‌ర్‌కు నోటీసులు కూడా అందాయ‌ట‌. పారితోషికం విష‌యంలో హ‌ర్ట్ అయిన శంక‌ర్ లైకా చెప్పిన‌ట్టే `ఇండియ‌న్ 2`ని మ‌ళ్లీ ప‌ట్టాలెక్కిస్తాడా?  లేక రామ్‌చ‌ర‌ణ్ చిత్రాన్ని ప్రారంభిస్తాడా అన్న‌ది తెలియాలంటే శంక‌ర్ రిప్లై కోసం వేచి చూడాల్సిందే.