న‌టుడు శ‌ర‌త్‌కుమార్‌కు బెదిరింపు కాల్స్‌!

న‌టుడు శ‌ర‌త్‌కుమార్‌కు బెదిరింపు కాల్స్‌!
న‌టుడు శ‌ర‌త్‌కుమార్‌కు బెదిరింపు కాల్స్‌!

ఇటీవ‌ల హ్యాక‌ర్స్ ఆగ‌డాలు మ‌రీ మితిమీరి పోయాయి. సెల‌బ్రిటీల ట్విట్ట‌ర్ అకౌంట్‌ల‌ని హ్యాక్ చేస్తూ సంచ‌ల‌నం సృష్టించిన హ్యాక‌ర్స్ తాజాగా ఓ ప్ర‌ముఖ న‌టుడి ఫోన్‌నే హ్యాక్ చేసి అత‌ని గొంతులో మాట్లాడుతూ బెదిరింపుల‌కు దిగ‌డం సంచ‌ల‌నంగా మారింది. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో హీరోగా, స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు త‌మిళ న‌టుడు శ‌ర‌త్‌కుమార్‌. గ‌త కొంత కాలంగా హీరోల‌కు స‌పోర్టింగ్ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారాయ‌న‌.

ఆయ‌న ఫోన్‌ని హ్యాక్ చేసిన హ్యాక‌ర్స్ అత‌ని గొంతుని అనుక‌రిస్తూ ఆయ‌న ఫోన్ నుంచి ఆయ‌న‌కే ఫోన్ చేయ‌డం త‌మిళ‌నాట సంచ‌ల‌నంగా మారింది. దీంతో తేరుకున్న శ‌ర‌త్‌కుమార్ వెంట‌నే  త‌న ఫోన్ హ్యాక్ కు గురైంద‌ని గ‌మ‌నించి పైబ‌ర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్ర‌యించారు. త‌న వాయిస్‌తో వచ్చిన బెదిరింపు కాల్స్‌కి త‌న‌కి ఎలాంటి సంబంధం లేద‌ని, త‌న ఫోన్‌ని హ్యాక్ చేసిన హ్యాక‌ర్స్ పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెన్నై పోలీసుల్ని ఆశ్ర‌యించారు.

కేసు ఫైల్ చేసిన పోలీసులు హ్యాకర్స్ కోసం ద‌ర్యాప్తుని ముమ్మ‌రం చేశారు. ఇటీవ‌ల అలీ పేరుతో ఫేక్‌ ట్విట్ట‌ర్ అకౌంట్‌ని క్రియేట్ చేసి ప‌వ‌న్‌పై పోస్ట్‌లు పెట్ట‌డంతో అలీ పోలీసుల్ని సంప్ర‌దించిన విష‌యం తెలిసిందే. అలాగే సింగ‌ర్ సునీత సోష‌ల్ మీడియా అకౌంట్‌ని హ్యాక్ చేసిన దుండులు ఇలాంటి బెదిరింపుల‌కు దిగ‌డంతో ఆమె సైబ‌ర్ పోలీసుల్ని ఆశ్ర‌యించారు.