మ‌తంపై షారుఖ్ సంచ‌ల‌న కామెంట్స్‌!


Sharukh khan sensational comments on religion
Sharukh khan sensational comments on religion

బాలీవుడ్ బాద్‌షా షాకుఖ్ ఖాన్ మ‌తంపై చేసిన వ్యాఖ్య‌లు ఇంట‌ర్నెట్‌లో సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. రిలీజియ‌న్‌, పౌర‌స‌త్వంపై దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. బీజేపీ తెచ్చిన పౌర స‌త్వ బిల్లుపై ఉత్త‌రాది ఇప్ప‌టికే భ‌గ్గుమంటోంది. విధ యూనివ‌ర్శిటీల్లో పౌర‌స‌త్వ బిల్లుపై జ‌రుగుతున్న నిర‌స‌న‌లు ఇంకా త‌గ్గుముఖం ప‌ట్ట‌లేదు. అలాంటి వేళ మ‌తంపై షారుఖ్ చేసిన వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి.

దేశం మొత్తం చ‌ర్చ జ‌రుగుతున్న వేళ త‌న కూతురు సుహాన త‌మ మ‌తం ఏంట‌ని అడిగింద‌ని షారుఖ్‌ వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఓ టీవీ షోలో పాల్గొన్న షారుఖ్ తాజా వ్యాఖ్య‌లు చేశారు. ఈ దేశంలో నివ‌సించే వారికి ఒకే మ‌త‌మ‌ని, అది హందుస్తాన్ అని వెల్ల‌డించారు. మా ఇంట్లో ఎవ‌రూ హింతూ , ముస్లీమ్‌కు సంబంధించిన ప్ర‌స్థావ‌న తీసుకురార‌ని, త‌న భార్య గౌరీ హిందువు అని, త‌ను ముస్లిమ్ అని అయినా మా మాథ్య ఏనాడూ ఆ చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌ని షారుఖ్ ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు.

మా పిల్ల‌లు హిందుస్థాన్‌లు, మేమంతా ఇండియ‌న్‌లం. చిన్న త‌నంలో సుహాన స్కూల్ వెళుతున్న సంద‌ర్భంలో త‌న‌ని స్కూల్‌లో `మీరు ఏ రిలీజియ‌న్‌కు చెందిన వార‌ని` అడిగిన ప్ర‌శ్నకు స‌మాధానం ఏంట‌ని అడిగేద‌ని, అప్పుడు తాను మ‌నం ఇండియ‌న్‌ల‌మ‌ని చెప్పేవాడిన‌ని ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.