నాగ్ సినిమాల్ షారుక్ స్పెషల్ రోల్Sharukh khan special role in Nagarjuna film
Sharukh khan special role in Nagarjuna film

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా అనేక కథలపై చర్చలు జరుపుతున్న ఈ స్టార్ హీరో ఎట్టకేలకు కోలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. రేపో మాపో ఆ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఏనౌన్స్మెంట్ వెలువడనుంది. ఆ ప్రాజెక్ట్ కి ‘సంకీ’ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లు టాక్ వచ్చింది. ఇక రీసెంట్ గా షారుక్ మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

అయితే అది జస్ట్ అతిధి పాత్రే అని 15 నిమిషాల వరకు కనిపించే స్పెషల్ పాత్ర అని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆ సినిమా మరేదో కాదు. నాగార్జున స్పెషల్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ చిత్రం బ్రహ్మాస్త్రా. రణ్ బీర్ కపూర్ – అలియా భట్ – అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ కూడా ఆ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేశారు. అయితే సినిమాలో మరొక స్పెషల్ పాత్రకు చిత్ర యూనిట్ ఇటీవల షారుక్ ని సంప్రదించింది.
క్యారెక్టర్ నచ్చడంతో వెంటనే డేట్స్ ఇచ్చేశారట. నవంబర్ లో మరో షెడ్యూల్ ని మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆ షెడ్యూల్ లో షారుక్ 15రోజుల పాటు వర్క్ చేయనున్నట్లు సమాచారం. బ్రహ్మాస్త్రా సినిమా ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.  వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.