స్నేహం-ప్రేమ నేపథ్యంలో శర్వానంద్ కొత్త చిత్రం


sharvanand new movie opening
sharvanand new movie opening

రణరంగం‘ వంటి మాస్ తరహా చిత్రం తరువాత శర్వానంద్ మరో కొత్త చిత్రం చేయబోతున్నాడు. ఈ చిత్రంలో సింపుల్ బోయ్ నెక్స్ట్ డోర్ పాత్రలో నటిస్తున్నాడు శర్వా.. శ్రీ కార్తీక్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్ పతాకంపై ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పెళ్లిచూపులు చిత్రంతో ఒక్కసారిగా ఫెమస్ అయిన రీతూ వర్మ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.

అలాగే తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి పదునైన సంభాషణలు రాయడం విశేషం..జాక్స్ బేజాయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.. వెన్నలకిషోర్, నాజర్, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 28న [పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది.

ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు. సెప్టెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ చన్నైలో జరుగుతుంది. తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందే ఈ చిత్రం 2020 సమ్మర్లో విడుదల కానుంది..!