సూపర్ హిట్ రీమేక్ లో శర్వానంద్ – సమంత


Sharwanand and samantha in 96 remake

తమిళనాట సంచలన విజయం సాధించిన 96 చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి అగ్ర నిర్మాత దిల్ రాజు హక్కులు పొందిన విషయం తెలిసిందే . విజయ్ సేతుపతిత్రిష నటించిన పాత్రల్లో తెలుగులో శర్వానంద్సమంత లు నటించనున్నారు . తాజాగా ఈ చిత్ర విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు . ఇక రెగ్యులర్ షూటింగ్ మార్చి నుండి ప్రారంభం కానుంది . ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ సి . ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు .

శర్వానంద్ – సమంత లు ఇంతకుముందు జంటగా నటించలేదు , ఇదే తొలి కాంబినేషన్ వాళ్లకు . సమంత వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతోంది . అయితే శర్వానంద్ మాత్రం పడిపడి లేచె మనసు తో డిజాస్టర్ అందుకున్నాడు . మరి ఈ రీమేక్ చిత్రం శర్వానంద్ కు హిట్ ఇస్తుందో ? లేదో చూడాలి .

English Title: Sharwanand and samantha in 96 remake