ఆ పాత్రలో ఎన్టీఆర్ అయితేనే బాగుంటుంది కానీ


sharwanand as young ntr in ntr biopic

ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్ పైకి వెళ్ళడానికి అంతా సిద్ధం అవుతోంది అయితే ఎన్టీఆర్ గా బాలయ్య నటిస్తుండగా యుక్త వయసులో ఉన్నప్పటి ఎన్టీఆర్ పాత్ర ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేత చేయిస్తారని అనుకున్నారు అంతా ! కానీ బాలయ్య కు ఎన్టీఆర్ కు అంతగా పొసగడం లేదు కాబట్టి ఎన్టీఆర్ ని కాదని మరో యంగ్ హీరో ని ఆ పాత్రలో నటింప జేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇంతకీ యుక్త వయసులో ఉన్న ఎన్టీఆర్ పాత్రలో నటించబోయే యంగ్ హీరో ఎవరో తెలుసా ……. ….. శర్వానంద్ .

అవును ! బాలయ్య స్వయంగా శర్వానంద్ పేరు సూచించాడట దాంతో దర్శకులు తేజ శర్వా ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది . అయితే ఈ వార్త అధికారికంగా ప్రకటించాల్సి ఉంది . శర్వానంద్ ఎన్టీఆర్ పాత్ర వేస్తే బాగానే ఉంటుంది కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వేస్తే ఇంకా అదరహో లెవల్లో ఉండేది . కానీ మన చేతుల్లో ఏమి లేదు కదా ! అంతా బాలయ్య మహిమ .