శర్వానంద్ దళపతి గా మెప్పిస్తాడా ?


యంగ్ హీరో శర్వానంద్ తాజాగా సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమా దాదాపుగా పూర్తయ్యింది . ఇందులో శర్వానంద్ రెండు గెటప్ లలో కనిపించనున్నాడు . డాన్ క్యారెక్టర్ చేస్తున్నాడు దాంతో ఈ చిత్రానికి దళపతి అనే టైటిల్ ని పెట్టే ఆలోచన చేస్తున్నారు . దళపతి అనే టైటిల్ కాకుండా పలు రకాల పేర్లని అనుకున్నారు కానీ అందరు కూడా దళపతి వైపే మొగ్గు చూపుతున్నారట .

రజనీకాంత్ – మమ్ముట్టి కలిసి నటించిన సూపర్ హిట్ చిత్రం దళపతి . మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం ఇప్పటికి కూడా టివిలో ఎప్పుడు ప్రసారమైన అద్భుతమైన వ్యూస్ సొంతం చేసుకుంటోంది . కాగా రజనీకాంత్ సూపర్ హిట్ టైటిల్ ని శర్వానంద్ న్యాయం చేయగలడా ? అన్నది ప్రశ్నగా మిగిలింది . అయితే విభిన్న తరహా పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరో శర్వా కాబట్టి దళపతి గా మెప్పిస్తాడనే అంటున్నారు . ఇక ఈ సినిమాని వచ్చే నెలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .