96 రీమేక్ విషయంలో శర్వా ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు?


96 రీమేక్ విషయంలో శర్వా ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు?
96 రీమేక్ విషయంలో శర్వా ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు?

గత రెండు మూడేళ్ళుగా శర్వానంద్ మంచి జోష్ చూపించాడు. వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఫలితాలతో సంబంధం లేకుండా ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమాకు కాల్ షీట్స్ కేటాయిస్తూ ఏడాదికి రెండు కుదిరితే మూడు అన్నట్లుగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రస్తుతం 96 రీమేక్ చిత్ర పనుల్లో బిజీగా ఉన్న శర్వానంద్ ఎందుకనో స్పీడ్ ఒక్కసారిగా తగ్గించేసాడు. 96 రీమేక్ తర్వాత చేసే చిత్రం ఏంటో ఇంతవరకూ క్లారిటీ ఇవ్వలేదు. 96 ఫిబ్రవరిలో ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తయింది. అయినా ఇంతవరకూ శర్వానంద్ తర్వాతి చిత్రం విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడం ఆశ్చర్యపరుస్తుంది. దీనికి కారణం శర్వానంద్ కు తగిలిన వరస ఎదురుదెబ్బలేనని తెలుస్తోంది. ఇటీవలే బాగా నమ్మి చేసిన చిత్రాలు పడి పడి లేచె మనసు, రణరంగం రెండూ కూడా దారుణమైన ఫలితాల్ని అందుకున్నాయి. ఈ చిత్రాలకు శర్వా మార్కెట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టారు. బయ్యర్లకు భారీ లాస్ లు ఈ రెండు చిత్రాలు తీసుకొచ్చాయి.

అందుకే శర్వానంద్ ఈసారి రిస్క్ తీసుకోవాలని అనుకోవట్లేదు. మిగతా యువ హీరోలు దూసుకుపోతుండడంతో ఇక మేల్కొనాల్సిన సమయం వచ్చిందని శర్వానంద్ ఫీల్ అవుతున్నాడు. సినిమా లేట్ అయినా పర్లేదు, రిస్క్ మాత్రం తీసుకోకూడదు అని చెప్పి ఏ కథను ఇప్పటివరకూ ఓకే చేయలేదు. అలా అని శర్వాకు కథలు రావట్లేదని కాదు, వస్తున్నాయి. శ్రీకారం, కీరవాణి అనే రెండు స్క్రిప్టులను శర్వా లైన్లో పెట్టాడు. అయితే వాళ్లకు కమిట్మెంట్ మాత్రం ఇవ్వలేదు. ఈ స్క్రిప్ట్స్ కు ఇంకా ట్యూనింగ్ అవసరమని తేల్చాడు శర్వానంద్. ప్రస్తుతం ఆ దర్శకులు అదే పనిలో ఉన్నారు. గత కొంత కాలంగా శర్వాకు హిట్లు ఎన్ని వచ్చాయో, ప్లాపులు కూడా అన్నే వచ్చాయి. వరసపెట్టి హిట్లు కొడితేనే నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళగలం, లేదంటే ఇలా మిడ్ రేంజ్ లోనే ఉండిపోవాలని అతనికి భయం పట్టుకుంది. అందుకే సినిమాల ఎంపికలో బాగా జాగ్రత్త పడిపోతున్నాడు.

మరోవైపు 96 రీమేక్ విషయంలో కూడా శర్వానంద్ ఏం మాట్లాడట్లేదు. ప్రమోషన్స్ విషయంలో అసలు నోరు మెదపట్లేదు. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. 96 ఫిబ్రవరిలో విడుదల కావలసిన సినిమా. దీనికి ఇప్పటినుండే ప్రమోషన్స్ చేస్తే అంచనాలు పెరిగే ఛాన్స్ ఉంది. అలా అంచనాలు పెంచేకంటే లో ప్రొఫైల్ లోనే సినిమా చేయాలని శర్వానంద్ అనుకుంటున్నాడు. అందుకే 96 ప్రమోషన్స్ ను అప్పుడే మొదలుపెట్టాలన్న ఆలోచనను పక్కనపెట్టామని అటు దిల్ రాజు అండ్ కో కూడా సలహా ఇచ్చాడు. ఈ చిత్రం వర్డ్ ఆఫ్ మౌత్ మీద హిట్ అవ్వాల్సిన సినిమా. అంచనాలు పెంచేయడం వల్ల మొదటికే మోసం వస్తుంది. తమిళ చిత్రం కూడా సైలెంట్ గా వచ్చి సెన్సేషనల్ హిట్ అయింది. అదే పద్దతిని ఇక్కడ కూడా ఫాలో అవ్వాలని నిర్ణయించాడు శర్వానంద్. అందుకే 96 రీమేక్ కు అప్పుడే ప్రమోషన్స్ లేవు.