తమిళంలో “96” – తెలుగులో “జాను”తమిళంలో “96” – తెలుగులో “జాను”
తమిళంలో “96” – తెలుగులో “జాను”

ప్రేమకు అసలైన నిర్వచనం ఇచ్చే విధంగా వచ్చిన ఎన్నో గొప్ప చిత్రాలలో ఖచ్చితంగా తమిళంలో గత ఏడాది వచ్చిన “96” సినిమా కోడా ఒకటి. విజయ్ సేతుపతి & త్రిష అనే ఒక అద్భుతమైన జోడీతో సి.ప్రేమ కుమార్ అనే వ్యక్తి తీసిన ఒక ప్రేమ కావ్యం “96.” ఈ సినిమా లో ఏం ఉంది.? అనేది సినిమా చూసాక ప్రత్యక్షంగా తెలుసుకుని తీరవలసిందే. ఈ సినిమాకు మరొక ప్రధానమైన బలం “గోవింద్ వసంత” గారు ఇచ్చిన మ్యూజిక్. ముఖ్యంగా “కాదలే… కాదలే” పాట అయితే ఒక సెన్సేషన్.

ఇప్పుడు దిల్ రాజు గారు ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. శర్వానంద్ & సమంత ఇద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని ఇవాళ విడుదల చేసారు. ఈ సినిమాకు “జాను” అనే పేరు ని ఖరారు చేసారు. ఇక పోస్టర్ లో భాగంగా హీరో శర్వానంద్ ఒక ఎడారిలో ఒంటెలతో కనిపిస్తాడు. “షరతులు, నియమాలు లేని ప్రేమకు అసలైన నివాళి” అనే ట్యాగ్ లైన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు చిత్ర యూనిట్. మొత్తానికి కళ్ళతో అనేక భావాలు పలికించగల నటులు శర్వా – సామ్ ల మ్యాజిక్ ఈ సినిమాలో ఎలా ఉంటుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Credit: Twitter