వరస సినిమాలతో ఫుల్ బిజీగా శర్వానంద్


వరస సినిమాలతో ఫుల్ బిజీగా శర్వానంద్
వరస సినిమాలతో ఫుల్ బిజీగా శర్వానంద్

శర్వానంద్ కెరీర్ పరంగా ప్లాప్స్ లో ఉన్నాడు. 2017లో వచ్చిన శతమానం భవతి తర్వాత శర్వానంద్ కు విజయమన్నదే లేదు. పడి పడి లేచె మనసు, రణరంగం సినిమాలు క్రితం ఏడాది విడుదలై ప్లాపయ్యాయి. ఈ ఏడాది జాను సినిమాతో వచ్చినా ఫలితం మాత్రం మారలేదు. అయితే ప్లాపుల్లో ఉన్నా కానీ శర్వానంద్ సినిమాలకు మాత్రం కొదవ లేదు. వరస సినిమాలతో వచ్చే రెండేళ్లు ఫుల్ బిజీగా ఉండనున్నాడు శర్వానంద్.

కొత్త దర్శకుడితో రైతుల నేపథ్యంలో తీసిన శ్రీకారం షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుని రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. అది కాకుండా అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాల్సి ఉంది. ఖైదీ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతల బ్యానర్ లో శర్వానంద్ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి కమిటయ్యాడు.

రీసెంట్ గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేస్తాడని అధికారికంగా వెల్లడైంది కూడా. ఈ సినిమాలు అన్నీ కాకుండా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో కొత్త దర్శకుడితో మరో సినిమాకు కమిటయ్యాడు శర్వానంద్. సినిమాల లైనప్ వరకూ ఓకే కానీ ఇంతకీ శర్వానంద్ వీటిలో ఎన్ని సినిమాలతో హిట్స్ అందుకుంటాడో చూడాలి మరి.