శర్వానంద్ కు రెండు నెలల విశ్రాంతి తప్పదట


Sharwanand movies in trouble
Sharwanand movies in trouble

హీరో శర్వానంద్ కు రెండు నెలల విశ్రాంతి తప్పదని ఆపరేషన్ చేసిన డాక్టర్లు స్పష్టం చేయడంతో శర్వా సినిమాలు డైలమాలో పడ్డాయి . శర్వానంద్ భుజానికి గాయాలు కావడంతో 11 గంటల పాటు శస్త్ర చికిత్స జరిగిన విషయం తెల్సిందే . అయితే శస్త్ర చికిత్స చేసిన సన్ షైన్ డాక్టర్ గురువారెడ్డి మాట్లాడుతూ శర్వానంద్ కు తగిలిన గాయాల కారణం గా రెండు నెలల పాటు తప్పనిసరిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించాడు

రెండు నెలల పాటు విశ్రాంతి అంటే తప్పకుండా శర్వా సినిమాలపై ప్రభావం పడటం ఖాయం . రణరంగం చిత్రం దాదాపుగా అయిపోవచ్చింది కాబట్టి సినిమా విడుదలలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు కానీ 96 చిత్రం మాత్రం రెండు నెలల పాటు వాయిదాపడనుంది అలాగే శర్వానంద్ ఒప్పుకున్న ఇతర సినిమాలు కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి