శరవేగంగా సినిమాలు లైన్ లో పెడుతున్న శర్వానంద్


Sharwanand new movie with kishore thirumala
Sharwanand new movie with kishore thirumala

“మూడో ప్రపంచం అంటూ వస్తే … అది నీళ్ళ కోసమే అని గతంలో ఎవరో చెప్తే నమ్మలేదు.! ఇప్పుడు నమ్మక తప్పేలా లేదు..!” అంటూ హై లెవెల్ ఇంటెన్సిటీ తో శర్వానంద్ చెప్పిన డైలాగ్ ని ఎవరూ మర్చిపోలేరు. రణరంగం సినిమా అన్ని రకాలుగా నెక్స్ట్ లెవల్ లో ఉన్నా, ఆ సినిమా ఎందుకో మరి.? జనాలకు కనెక్ట్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ డిఫరెంట్ గా తమిళ 96 సినిమా రీమేక్ అయిన “జాను” రామ్ గా కనిపించాడు మన శర్వా. ఇక “మక్కల్ సెల్వన్” విజయ్ సేతుపతి స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా నటించి, రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ లో నటుడిగా తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు హై స్పీడ్ లో సినిమాలు చేసుకుంటూ, వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే జాను సినిమా షూట్ కంప్లీట్ చేసి శ్రీకారం సినిమాలో నటిస్తున్నాడు శర్వానంద్.

రీసెంట్ గా రిలీజ్ అయిన శ్రీకారం ఫస్ట్ లుక్ లో “పొద్దున్నే పొలానికి వెళ్ళే కేశవులు కొడుకు గా” అల్టిమేట్ నేటివిటీ చూపించాడు. శ్రీకారం సినిమా ఈ ఏడాది సమ్మర్ కి రిలీజ్ అవుతోంది. జాను సినిమా ప్రేమికుల రోజు కంటే ఒక వారం ముందుగా ఫిబ్రవరి 7 న రిలీజ్ అవుతోంది. వెంటనే శర్వానంద్ దర్శకుడు కిషోర్ తిరుమల తో మరొక సినిమా ఓకే చేసాడని సమాచారం. కిషోర్ తిరుమల తన మొదటి సినిమా “నేను శైలజ”, తరువాత “ఉన్నది ఒకటే జిందగీ”, ఆపై సాయి తేజ్ తో “చిత్రలహరి” వంటి సినిమాలు చేసాడు.డైలాగ్స్ అండ్ లవ్ స్టోరీస్ టేకింగ్ తనదైన మార్క్ వేసుకున్నాడు కిషోర్. ఇప్పుడు రామ్ పోతినేని తో తమిళ “తడం” రీమేక్ అయిన “రెడ్” సినిమా చేస్తున్నాడు. ఇక 6 నెలలు కాకుండానే కొత్త ఏడాదిలో శర్వానంద్ ౩ సినిమాలు రిలీజ్ చేసేస్తాడు . ఇలాగే శర్వానంద్ కెరియర్ ఆరు సినిమాలు, 3 హిట్లుగా ఉండాలని కోరుకుందాం.