శ‌ర్వానంద్ పిరియాడిక్ ఫిల్మ్ చేస్తున్నారా?


శ‌ర్వానంద్ పిరియాడిక్ ఫిల్మ్ చేస్తున్నారా?
శ‌ర్వానంద్ పిరియాడిక్ ఫిల్మ్ చేస్తున్నారా?

`బాహుబ‌లి`, తాజాగా `ఆర్ ఆర్ ఆర్‌`.. ఈ చిత్రాల స్ఫూర్తితో తెలుగులో ఏ హీరోని క‌దిపినా వినిపిస్తున్న మాట పాన్ ఇండియా. విజ‌య్ దేవ‌ర‌కొండ నుంచి నాని వ‌ర‌కు అంతా పాన్ ఇండియా చిత్రాల‌పై క‌న్నేశారు. అల్లు అర్జున్ న‌టిస్తున్న `పుష్ప‌` కూడా  పాన్ ఇండియా స్థాయిలో రూపందుతుండ‌టంతో యంగ్ హీరో శ‌ర్వానంద్ కూడా త‌న త‌దుప‌రి చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో పిరియాడిక్ ఫిల్మ్‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.

ఇటీవ‌ల శ‌ర్వా న‌టించిన ప‌డి ప‌డి లేచే మ‌న‌సు, ర‌ణ రంగం, జాను చిత్రాలు ఆశించిన విజ‌యాన్ని సాధించ‌క‌పోవ‌డంతో ఆలోచన‌లో ప‌డ్డ శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం శ్రీ‌కారం చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. చివ‌రి షెడ్యూల్‌ని తిరుప‌తిలో జ‌ర‌పాల‌ని ప్లాన్ చేశారు. క‌రోనా కార‌ణంగా ఆ ప్లాన్ మొత్తం తారుమారైంది.

ఇదిలా వుంటే చందూ  మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వానంద్ ఓ భారీ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. పిరియాడిక్ ల‌వ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. 1910 – 2021 మ‌ధ్య కాలం నేప‌థ్యంలో ఈ చిత్ర క‌థ సాగుతుంద‌ని, ఈ చిత్రంలో శ‌ర్వానంద్‌కు జోడీగా ముగ్గురు క‌థానాయిక‌లు న‌టించ‌నున్నార‌ని తెలిసింది.